గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకొచ్చి.. భారీ వాన కురిసింది. నిన్నటి వాన నుంచి తేరుకోక ముందే వాతావరణ శాఖ ప్రజలకు మరో హెచ్చరిక జారీ చేసింది.
గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకొచ్చి.. భారీ వాన కురిసింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో జలమయం అయ్యాయి. అలానే మెదక్, వికారాబాద్ జిల్లాలో భారీ వడగళ్ల వాన కురిసింది. మనం జమ్ముకశ్మీర్ లో ఉన్నామా? అనేంతాల రోడ్లపై వడగళ్లు పడ్డాయి. నిన్న వర్షం నుంచే కోలుకోని ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో భారీ వడగళ్ల వాన పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. అలానే వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వడగళ్ల వాన బీభత్సం సృష్టిచింది. దీంతో ఈ మూడు జిల్లాలో ఎక్కడ చూసిన వడగళ్ల కుప్పలే కనిపించాయి. మూడు జిల్లాలోని పలు ప్రాంతాలు కశ్మీర్ ను తలపించాయి. ఈ వడగళ్ల వాన దెబ్బకు తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేరు శనగ, వరి వంటి ఇతర పంటలు తడిసిముద్దయ్యాయని రైతులు వాపోతున్నారు.
నిన్నటి వాన దెబ్బకే కోలుకోని తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు భారీ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు, ఆదివారాల్లో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు సముద్ర మట్టానికి కిలోమీటర్ల దూరంలో కాస్తా ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రానున్న మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ లోని పలు రాష్ట్రాల్లో భారీ వానలు పడనున్నాయి.
ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. నేడు దక్షిణ తెలంగాణాలోని పలు జిల్లాలో భారీ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. అలానే రేపు ఉమ్మడి రంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో ఉరుములు తో కూడిన వర్షం పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరి.. తెలంగాణలో కురిసిన ఈ భారీ వడగళ్ల వానలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.