కొందరు షాపింగ్ మాల్స్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజును వసూలు చేస్తున్నారు. చాలా మంది వినియోదారులు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం అధికారులకు ఫిర్యాదు చేస్తుంటారు. అలా వచ్చిన ఫిర్యాదులతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు జరిమానాలు విధిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ మాల్ కు అధికారులు భారీ జరిమానా విధించారు.
ప్రజలు తమ అవసరాల నిమిత్తం, వినోదం కోసం షాపింగ్ మాల్స్, థియేటర్లకు వెళ్తుంటారు. వినియోదారులకు పార్కింగ్ సౌకర్యం కల్పించడం మాల్స్ వారి బాధ్యత. ప్రభుత్వాలు కూడా మాల్స్, థియేటర్ల యాజమాన్యలకు పలు రకాల ఆదేశాలు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే కొందరు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజును వసూలు చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అధికారులకు ఫిర్యాదు చేస్తుంటారు. అలా వచ్చిన ఫిర్యాదులతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తుంటారు. తాజాగా కూకట్ పల్లి జేఎన్టీయూ ప్రాంతంలోని ఓ మాల్ కి జీహెచ్ఎంసీ అధికారులు భారీ జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్‌లో ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించాల్సి ఉన్నా బాధ్యత నిర్వాహకులుపై ఉంటుంది. హైదరాబాద్ లోని మాల్స్ కు, థియేటర్లకు నియమ, నిబంధనలను జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేశారు. అంతేకాక నిబంధనలను అతిక్రమిస్తే.. కొరడ జులిపిస్తామని హెచ్చరించారు. ఎవరైన అక్రమదందాలకు పాల్పపడితే ఫిర్యాదు చేయమని జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చింది. అలానే వినియోదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తోంది.
తాజాగా కూకట్‌పల్లి జేఎన్‌టీయూ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ నిర్వాహకులపై భారీ జరిమానా విధించింది. ట్విటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు విచారణ చేపట్టారు. ఈ మాల్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్నారని అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో మాల్ నిర్వహకులకు రూ.50 వేల జరిమానా విధించారు.అయితే ఉచిత పార్కింగ్ విషయంలో మనం కూడా తెలుసుకోవాలిన విషయాలు కొన్ని ఉన్నాయి. నూతన పార్కింగ్ విధానం ప్రకారం.. వినియోదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదు. మాల్‌లో వస్తువులను కొన్నారా? లేదా అనే అంశంతో సంబంధం లేకుండా అరగంట పాటు ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించాలి.
వినియోదారులు అంతకంటే ఎక్కువ సమయం వాహనాన్ని పార్కింగ్ చేస్తే, నిబంధనల ప్రకారం నిర్దేశించిన మొత్తాన్ని పార్కింగ్ రుసుము కింద చెల్లించాలి. ఒక వేళ పార్కింగ్ ఫీజు కంటే విలువైన వస్తువులను వినియోదారుడు కొనుగోలు చేస్తే.. పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ నియమ, నిబంధనలను ఉల్లంగించి, ఎవరైనా పార్కింగ్ రుసుమును వసూలు చేస్తే.. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. మరి.. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న మాల్ లపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In pursuance to the instructions for the enforcement of Parking Policy, process is herewith being placed in public notice along with proforma complaint. The penalization is now live & citizens may follow the process for issuance of penalty by @CEC_EVDM @KTRTRS @arvindkumar_ias pic.twitter.com/Y18ArB8V4z
— Director EV&DM, GHMC (@Director_EVDM) March 30, 2021