కరీంనగర్ జైలులో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టు లో ఊరట లభించింది. బండి సంజయ్ వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే బండి సంజయ్ జుడిషియల్ రిమాండ్ పై స్టే విధించింది. వ్యక్తిగత పూచి రూ. 40 వేలు ఖర్చుపై విడుదల చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఇది చదవండి : పేదలపై ప్రేమ అంటే ఇదేనా.. ఆర్టీసీ టికెట్ల రేటు పెంపుపై నాదెండ్ల ఫైర్!
బదిలీలకు సంబంధించి కేసీఆర్ సర్కార్ విడుదల చేసిన జీవో 317ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ దీక్షకు దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కోవిడ్ ఆంక్షలకు విరుద్ధంగా జాగరణ దీక్ష చేపట్టడంతో పాటు పోలీస్ విధులను అడ్డుకోవడంతో బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక బండి సంజయ్‌కి కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.