టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర కామెంట్లు చేశారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి రెండు టెస్టులకు వైస్ ఎవరో చెప్పకుండా.. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్సీని తప్పిండచంపై స్పందిస్తూ.. ఆయన పలు విషయాలను వెల్లడించారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా మూడో టెస్టు కోసం ఉత్సాహంగా ఎదురుస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా సైతం మిగిలిన రెండు టెస్టులను గెలిచి, సిరీస్‌ను డ్రా చేసి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ రెండు జట్ల మధ్య బుధవారం నుంచి ఇండోర్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు వైస్ కెప్టెన్ అవసరం లేదంటూ పేర్కొన్నారు. ఫామ్‌లో లేకపోయినా.. వైస్ కెప్టెన్సీ ట్యాగ్‌తో జట్టులో చోటు సంపాదించుకుంటున్నాడంటూ కేఎల్ రాహుల్‌పై కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే. ఇటివల రాహుల్‌నే బీసీసీఐ టెస్ట్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది.
ఈ క్రమంలో శాస్త్రి మాట్లాడుతూ..‘నేను కోచ్ గా భారత జట్టులో ఉన్నపుడు పుజారా, రాహుల్ని సైతం ఫామ్ లో లేకపోతే తప్పించాం. వారు దేశవాళీల్లో మంచి ప్రదర్శన కనబర్చి తిరిగి జట్టులోకి వచ్చారు. దీనితో మేము వారి నుంచి మంచి ఫలితాలని రాబట్టగలిగాం. వైస్ కెప్టెన్ ఫామ్ లో లేకపోతే అతన్ని తుది జట్టులో ఉంచాల్సిన అవసరం లేదు. నేనెప్పుడూ భారత జట్టుకి వైస్ కెప్టెన్ ఉండకూడదు అనే భావనతోనే ఉన్నాను. వైస్ కెప్టెన్ ఒకవేళ ఫామ్ లో లేకపోతే తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారుతుంది. కాబట్టి అత్యుత్తమంగా ఉండే 11 మందితోనే బరిలోకి దిగాలి. ఒకవేళ కెప్టెన్ ఏదైనా కారణం వలన మైదానాన్ని వీడాల్సి వస్తే అప్పుడు పరిస్థితులను బట్టి మరో ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించవచ్చు. విదేశాల్లో అయితే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కానీ స్వదేశంలో వైస్ కెప్టెన్ అవసరం ఉండదు. రాహుల్ మంచి ఆటగాడే కానీ ప్రస్తుతం అతనికి విరామం అవసరం. అతని స్థానంలో గిల్ లాంటి ఆటగాడు జట్టులోకి తీసుకోవాలి’ అని అన్నాడు.
ఈ సందర్భంగా భారత.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాల గురించి మాట్లాడుతూ.. “టీం ఇండియా మరొక విజయాన్ని సొంతం చేసుకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరుకుంటుంది. జూన్ లో ఇంగ్లండ్ లోని ఒవెల్లో జరిగే ఫైనల్లో మరల ఆస్ట్రేలియాతోనే తలబడే అవకాశముంటుంది. అప్పుటికల్లా ఆస్ట్రేలియా సీమర్లు ఫిట్‌నెస్ సాధించి ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ 4-0 తేడాతో గెలవడం వలన మానసికంగా ఆ జట్టుపై పై చేయి సాధించవచ్చు. బూమ్రా, షమీ, సిరాజ్‌తో కూడిన బౌలింగ్ ఎటాక్‌తో మన కూడా ఇంగ్లండ్‌లో రాణించవచ్చు’ అని పేర్కొన్నాడు. మరి రవిశాస్త్రీ వైస్ కెప్టెన్సీ విషయంలో చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Ravi Shastri gives his opinion on vice-captaincy and KL Rahul’s form #cricket #ravishastri #klrahul #indvsaus #indiancricket #bcci pic.twitter.com/TzH4sBGGcv
— Sports Today (@SportsTodayofc) February 26, 2023