1992లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన ముత్తయ్య మురళీధరన్ టెస్టులు, వన్డేలలో కల్పి 1300కు పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్. ఇక.. టెస్టులు, వన్డేలు, ఫస్ట్ క్లాస్, టీ20లు, లిస్టు ఏ మ్యాచులు అన్నీ కలిపితే.. ముత్తయ్య తీసిన వికెట్లు.. 3500 పైగా ఉన్నాయి. మనం చెప్పుకోవడానికి ఈ సంఖ్య వేలల్లో ఉన్నా, మైదానంలో వికెట్ల కోసం పోరాడే బౌలర్ కు తెలుస్తుంది.. దాని కష్టం విలువ. ఇలా.. ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి బౌలర్.. అదే దేశంలో మరొకరు వెలుగులోకి వచ్చారు. అతని పేరే.. ప్రభాత్ జయసూర్య.
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఇప్పటివరకు ఆడింది.. మూడే మూడు టెస్టు మ్యాచులు. అప్పుడే అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. అరంగ్రేటం చేసిన 20 రోజులకే.. టెస్ట్ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌గా మారాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.. తన వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. ఇప్పటివరకు ఆడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్.. తన జట్టును రెండు పర్యాయాలు ఒంటిచేత్తో గెలిపించాడు.
Four five-fors in his first three Tests.
You don’t get many better starts to a Test career than this from Prabath Jayasuriya.
Sri Lanka are currently third in the World Test Championship table.#WTC23 pic.twitter.com/J4LV2SHNhm
— Wisden (@WisdenCricket) July 28, 2022
తాజాగా, పాకిస్తాన్ తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) పడగొట్టిన ప్రభాత్ జయసూర్య శ్రీలంక జట్టుకు అపురూప విజయాన్నందించాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లోనూ (6/118, 6/59) అద్భుతంగా రాణించి, ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న తన దేశానికి ఊరట కలిగించే విజయాన్నందించాడు. ఈ ప్రదర్శనతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ప్రభాత్ జయసూర్య.. ఆ తర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లోనూ 9 వికెట్లు (5/82, 4/135) తీశాడు.
Prabath Jayasuriya in Test cricket:
6 for 118 vs Australia.
6 for 59 vs Australia.
5 for 82 vs Pakistan.
4 for 135 vs Pakistan.
3 for 80 vs Pakistan.
5 for 117 vs Pakistan. pic.twitter.com/KcZjHP4lRn— Johns. (@CricCrazyJohns) July 28, 2022
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం భారత్‌లో ‘800’ పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ప్రభాత్ జయసూర్య ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
JUST IN: Actor @VijaySethuOffl officially pulls out of Muttiah Muralitharan biopic ‘800’. pic.twitter.com/o99pHOSngQ
— Shiv Aroor (@ShivAroor) October 19, 2020
ఇదీ చదవండి: Shikhar Dhawan: మ్యాచ్ తర్వాత ధావన్ చేసిన పనికి ధోని ఫ్యాన్స్ ఫిదా!
ఇదీ చదవండి: IND vs SA 2007: క్రికెట్ దేవుడికే కోపం తెప్పించిన అంపైర్! ఆరోజు సచిన్ దెబ్బకు అంతా హడలిపోయారు!