"మహేంద్ర సింగ్ ధోని " ప్రస్తుతం ఐపీఎల్ లో ఈ పేరు మారు మ్రోగిపోతుంది. నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ అనంతరం టీం ఇండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కి షర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చి తన క్రేజ్ ఎలాంటిదో తెలియజేసిన ధోని.. మరో ఇద్దరు దిగ్గజాలకు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వడం విశేషం.
ఆడింది 6 టెస్టులో వికెట్లు మాత్రం 42. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ఘనత. శ్రీలంక ఆల్ టైం బెస్ట్ స్పిన్నర్, ప్రపంచంలోనే బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ మురళి ధరన్ కి కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. కానీ అతడికే సాధ్యమైంది. ఇంతకీ ఆ స్పిన్నర్ ఎవరు ?
కరేబియన్ వీరుడు, సిక్సర్ల కింగ్, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎలాంటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన రోజు ఎలాంటి బౌలర్‌నైనా చిత్తుచిత్తుగా కొట్టే క్రిస్ గేల్.. బౌలింగ్‌తోనూ మ్యాజిక్ చేయగలడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా వెస్టిండీస్‌తో పాటు తనాడిన చాలా ప్రాంచైజ్ జట్లకు గేల్ బ్యాట్, బాల్‌తోనూ సేవలందించాడు. తాజాగా తన బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. తానో గొప్ప ఆఫ్ స్పిన్నర్‌నని, ముత్తయ్య మురళీథరన్ కూడా తనకు పోటీ రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. […]
1992లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన ముత్తయ్య మురళీధరన్ టెస్టులు, వన్డేలలో కల్పి 1300కు పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్. ఇక.. టెస్టులు, వన్డేలు, ఫస్ట్ క్లాస్, టీ20లు, లిస్టు ఏ మ్యాచులు అన్నీ కలిపితే.. ముత్తయ్య తీసిన వికెట్లు.. 3500 పైగా ఉన్నాయి. మనం చెప్పుకోవడానికి ఈ సంఖ్య వేలల్లో ఉన్నా, మైదానంలో వికెట్ల కోసం పోరాడే బౌలర్ కు తెలుస్తుంది.. దాని కష్టం విలువ. ఇలా.. ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ ప్రపంచంలో […]
ఐపీఎల్ 2022లో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. దాదాపు అసాధ్యం అనుకున్న గెలుపును రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా తమ సూపర్ హిట్టింగ్‌తో సాధించి చూపించారు. చివరి ఓవర్లో 22 పరుగులు కావాల్సిన తరుణంలో రషీద్ ఖాన్, తెవాటియా రెచ్చిపోయారు. మార్కో జన్‌సేన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రాహుల్ తెవాటియా లాంగ్ ఆన్‌లో సిక్సర్ బాదాడు. 2వ బంతికి సింగిల్ వచ్చింది. 3వ బంతికి రషీద్ […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను ఉద్దేశించి ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీథరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రషీద్ ఖాన్‌ను ఆటగాళ్ల రిటెన్షన్‌లో భాగంగా అట్టిపెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశామని, అయితే అతని రేంజ్‌లో (రెమ్యునరేషన్) మేము లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రషీద్ ఖాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుందని సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మురళీథరన్ పై విధంగా స్పందించాడు. […]
ఐపీఎల్ మెగా వేలంలో మన హోమ్ టీమ్ సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ కొనుగోలు చేసిన ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. SRH ఫ్యాన్స్ కూడా టీమ్ సరిగా లేదని సోషల్ మీడియా వేదికగా టీమ్ మేనేజ్‌మెంట్‌పై ట్రోల్ చేశారు. జట్టు బాగాలేదని సన్‌రైజర్స్ కోచ్ సైమన్ కటిచ్ రాజీనామా చేశాడు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో జట్టులోని ఆటగాళ్లపై ఎవరికీ అంతగా నమ్మకం లేకుండా పోయింది. వేలంలో విండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, షెఫర్డ్‌పై భారీ ధర పెట్టినందుకు కూడా […]