2022 ఏడాది టీమిండియాకు ఏ మాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022లోనూ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దారుణంగా విఫలమైంది. ఆసియా కప్‌లో టీమిండియా సూపర్ 4 దశలో ఇంటిబాట పట్టింది. అలాగే.. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌లోనూ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిన టీమిండియా తీవ్ర విమర్శల పాలైంది. జట్టు ప్రదర్శనతో పాటు భారత ఆటగాళ్లు ప్రదర్శన కూడా నిరాశపర్చింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ మినహా.. మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అయితే.. మరీ దారుణంగా విఫలం అయ్యారు.
విరాట్ కోహ్లీ కూడా ఆసియా కప్‌లో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో సెంచరీ బాదడం, టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 82తో పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించడం మినహా నిలకడగా రాణించలేదు. అదే వరల్డ్ కప్‌లో మరో మూడు రెండు హాఫ్ సెంచరీలు బాదినా.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌లలో విఫలం అయ్యాడు. విరాట్ కోహ్లీ తర్వాత.. భారత జట్టులో అంతటి స్టార్ డమ్ ఉన్న రోహిత్ శర్మ ఈ ఏడాది ఘోరంగా విఫలం అయ్యాడు. అతనితో పాటు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఇతర ఆటగాళ్లు సైతం ఫెయిల్ అయ్యారు. ఇక బౌలర్లు పరిస్థితి కూడా అంతే ఉంది. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో వరల్డ్ కప్‌తో పాటు మరికొన్ని సిరీస్‌లకు సైతం దూరం అయ్యాడు.
ఇలా టీమిండియాలోని ప్రధాన ఆటగాళ్లు దారుణంగా విఫలం అవ్వడం.. యువ క్రికెటర్లు తమకు వచ్చిన ఒకటీ రెండు అవకాశాల్లో మెరుస్తూ.. 2022 ఏడాదిని ముగించారు. దీంతో టీమిండియా తరఫున ఏడాది మొత్తం అద్భుతంగా నిలకడైన ప్రదర్శన ఆటగాళ్లు లేరు. దీంతో.. 2022 ఏడాదికి గాను ఐసీసీ క్రికెటర్ అవార్డుకు భారత్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఎంపిక కాలేదు. మరో విషయం ఏమిటంటే.. టీమిండియా లాంటి పెద్ద టీమ్ నుంచి ఒక్కరు కూడా నామినేట్ కానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు జింబాబ్వే లాంటి పసికూన జట్టు ఆటగాడు సికందర్ రజా నామినేట్ అయ్యాడు. ఇలా చివరికి జింబాబ్వే ప్లేయర్ కంటే మన భారత ఆటగాళ్లు దారుణంగా తయారంటూ.. టీమిండియా పరువు తీస్తున్నారంటూ.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. కాగా.. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్, ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్ టిమ్ సౌథీ, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా నామినేట్ అయ్యారు. ఈ నలుగురిలో ఒకరు ఈ అవార్డును అందుకోనున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Nominees for ICC cricketer of the year award 2022:
1) Babar Azam
2) Stokes
3) Southee
4) Raza— Johns. (@CricCrazyJohns) December 30, 2022