సాధారణంగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాక ఆటగాళ్లు.. తమ ఇష్టమైన కెరీర్ ను ఎంచుకుంటారు. కొంత మంది రాజకీయాల వైపు వెళితే.. మరికొంత మంది బిజినెస్ రంగంలోకి దిగుతుంటారు. అయితే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత సినిమా రంగంలోకి రావాలని సూచించింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్. దానికి రిప్లై సైతం ఇచ్చాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో నటించాలని సలహా ఇచ్చింది. సోషల్ మీడియాలో వార్నర్ వీడియోలు చూసి నెట్ ఫ్లిక్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరికి సుపరిచితుడే. గ్రౌండ్ లో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో.. సోషల్ మీడియాలో అంతకంటే ఎక్కువ యాక్టీవ్ గా ఉంటాడు. సోషల్ మీడియాలో హీరోలను అనుకరిస్తూ.. చేసే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా తెలుగు హీరోలను అచ్చుగుద్దినట్లు దించుతుంటాడు వార్నర్. తెలుగు హీరోల పాటలకు డ్యాన్స్ లు వేస్తూ.. ఆ వీడియోలను షేర్ చేస్తుంటాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమాలోని పాటలు, డైలాగులు వార్నర్ కు తెగ క్రేజ్ తెచ్చాయి. దాంతో అతడి యాక్టింగ్ చూసిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.. అతడికి ఓ సూచన ఇచ్చింది.
“డేవిడ్ వార్నర్ మీరు క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాక సినిమాల్లోకి రావాలి. ముఖ్యంగా మీరు తెలుగు సినిమాల్లో నటించండి. అదే మీ కెరీర్ కు సరైన వేదికగా మేం భావిస్తున్నాం” అని నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది. దీనికి వార్నర్.. నవ్వుతున్న ఎమోజీలను రిప్లైగా ఇచ్చాడు. ఇక వార్నర్ తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కెరీర్ లో వందో టెస్ట్ లో డబుల్ సెంచరీ సాధించి అరుదైన ఘనతను సాధించాడు. వార్నర్ వీడియోలు చూస్తే.. నెట్ ఫ్లిక్స్ అన్నది వందకు వంద శాతం కరెక్టే అనిపిస్తుంది.
😂😂😂😂😂 https://t.co/d5739HLOAZ
— David Warner (@davidwarner31) January 5, 2023