చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే).. ఐపీఎల్ లో అంత్యంత విజయవంతమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 14 ఎడిషన్లలో 2 సవంత్సరాలు నిషేధం కారణంగా దూరమవ్వగా.. మిగిలిన 12 ఎడిషన్లలో 4 సార్లు ఛాంపియన్స్ గా నిలవగా.. 5 సార్లు రన్నరప్ గా నిలిచింది. ఈ రికార్డులు చాలు సీఎస్‌కే జట్టు ఎంత విజయవంతమైందో తెలియడానికి. గతేడాది(2021) టైటిల్ విన్నర్ గా నిలిచిన సీఎస్‌కే మరోసారి టైటిలే లక్ష్యంగా తమ సన్నాహకాలను మొదలు పెట్టింది. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ఇంకా 20 రోజుల సమయం ఉన్నా.. అందరి కన్నా ముందే ప్రాక్టీస్ క్యాంప్ షురూ చేసింది. లీగ్ మొత్తం ముంబై, పుణేల్లో జరగనున్న నేపథ్యంలో అదే తరహా మైదానం కలిగిన సూరత్‌లో చెన్నై శిక్షణా శిభిరం ఏర్పాటు చేసింది. మూడు రోజుల క్వారంటైన్ అనంతరం ఆటగాళ్లంతా ఇవాళే(ఆదివారం) మైదానంలోకి అడుగుపెట్టారు.
అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు నిర్వహిస్తూ యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించనున్నారు. మొత్తానికి టీమ్ కాంబినేషన్.. లీగ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను ఈ ప్రాక్టీస్ క్యాంప్ ఆధారంగానే సిద్దం చేయనున్నారు. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు యువ ఆటగాళ్లు ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొన్నారు. తొలి రోజు ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను సీఎస్‌కే యాజమాన్యం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ముంబైలోని పిచ్‌లు ఇక్కడి పిచ్‌ల మాదిరిగానే ఉంటాయని భావించినందున సీఎస్కే యాజమాన్యం సూరత్ లోని లాల్‌భాయ్ స్టేడియాన్ని ప్రాక్టీస్ కోసం వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ధోనీతో పాటు నెట్ సెషన్‌లో పాల్గొన్న ఆసీఫ్.. ఇతర ఆటగాళ్ల కసరత్తులకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఇక ధోనీకి కెరీర్‌లో ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సీఎస్‌కే టీమ్‌కు సూరత్‌లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. చెన్నై టీమ్ సూరత్‌కు వస్తున్న విషయాన్ని ముందే తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో టీమ్ బస చేసే హోటల్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ వేదికగా పంచుకుంది. సింగమ్స్ ఇన్ సూపర్ అనే హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేసింది. ఇక ఈ సీజన్ వాంఖడే వేదికగా మార్చి 26 న సీఎస్‌కే, కేకేఆర్ మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తోనే ప్రారంభం కానుంది.
Shubh Aarambh @ Surat! ✨#SingamsInSurat #WhistlePodu 🦁💛
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022
Start the Summer Whistles… #EverywhereWeGo! 🥳#TataIPL #WhistlePodu 🦁💛 pic.twitter.com/YGrRPIQysy
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 6, 2022