ఎం ఎస్ ధోని విలన్ గా చెయ్యబోతున్నాడు. మన ఇండియా క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించే చెప్తున్నానా లేక ఇంకో ధోని ఎవరైనా ఉన్నారా అని అనుకుంటున్నారా? 100 పర్సెంట్ ఇండియన్ క్రికెట్ ని ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ గా తీర్చిదిద్ది ఇండియాకి రెండోసారి ప్రపంచ కప్ ని అందించిన ఎం ఎస్ ధోనినే.
భారతదేశ సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరు చూడని.. ఎవరు ఊహించని… ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎవరి ఊహకి కూడా అందని ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే ఒక వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అందులో ఒకరు ఇండియన్ సినిమాకే బాక్స్ ఆఫీస్ కింగ్ అయితే ఇంకొకరు ఒక ఆటకి సంబంధించి ఇండియా ని తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచంలోనే ఇండియాని నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్హాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఎంత విలక్షణమైన దర్శకుడో చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి.ముఖ్యంగా ఆయన సినిమాల్లో చేసే నటుల కాంబినేషన్ కూడా సినీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఆయన సినిమాలకి తమిళంలోనే కాకుండా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.
ఎన్నో హిట్ సినిమాలు ఆయన సొంతం. చెన్నై 600028, మనకత, బిర్యానీ లాంటి హిట్ సినిమాలు ఆయన సొంతం. అలాగే లేటెస్ట్ గా వచ్చిన మానాడు, మన్మధలీలైలతో సూపర్ హిట్ లు కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఇళయ దళపతి విజయ్ తో సినిమా చెయ్యబోతున్నాడు. లియో తర్వాత విజయ్ తన తదుపరి సినిమాని వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ టాక్. అలాగే ఈ మూవీలో విలన్ గా ఎవరు ఊహించని విధంగా ఎంఎస్ ధోని చేయబోతున్నాడు. ఏంటండీ నేను మన ఇండియా క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించే చెప్తున్నానా లేక ఇంకో ధోని ఎవరైనా ఉన్నారా అని అనుకుంటున్నారా? 100 పర్సెంట్ ఇండియన్ క్రికెట్ ని ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ గా తీర్చిదిద్ది ఇండియాకి రెండోసారి ప్రపంచ కప్ ని అందించిన ఎం ఎస్ ధోనినే. విజయ్, వెంకట్ ప్రభు ల సినిమా లో విలన్ గా ధోని చెయ్యబోతున్నాడు.
ఇప్పుడు ఈ వార్త తమిళ చిత్రపరిశ్రమతో పాటు భారతీయ చిత్రపరిశ్రమని ఒక ఊపు ఊపుతుంది. ఆల్రెడీ ధోని భార్య సాక్షి ఇటీవల చెన్నైలో జరిగిన ఒక సినిమా ఫంక్షన్ లో ధోని త్వరలో ఒక మాస్ కమర్షియల్ మూవీలో చేస్తారని కూడా చెప్పింది. సాక్షి మాటలు ఈ మూవీని ఉద్దేశించే ఉన్నాయని అందరూ అంటున్నారు. ఈ వార్త నిజం కావాలని తమిళనాడు మొత్తం కోరుకుంటుంది. పైగా తమిళనాడు ప్రజలకి ధోని అంటే ఎంతో ఇష్టం. ధోని ఐపీఎల్ లో సుదీర్ఘ కాలం చెన్నై తరఫున ప్రాతినిధ్యం వహించి చెన్నైని ఐపీఎల్ లో నెంబర్ వన్ గా తీర్చిదిద్దాడు. విజయ్ హీరోగా ధోని విలన్ గా సినిమా రావాలని భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇరువురి అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఎలాంటి పరిస్థుతుల్లోనైనా ఎంతో సహనంతో ఉండే ధోని విలన్ గా చేస్తే చూడాలని అందరూ కోరుకుంటున్నారు.