త కొంతకాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న రోహిత్ విండీస్ తో తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుని బ్రేక్ చేసాడు.
భారత క్రికెట్ లో రోహిత్ శర్మ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒక్కసారి క్రేజ్ లో నిలదొక్కుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్ లు ఆడేస్తాడనే పేరుంది. అయితే గత కొంతకాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న రోహిత్ విండీస్ తో తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. విండీస్ పర్యటనలో బాగా రెండు టెస్టుల సిరీస్ లో కెప్టెన్ రోహిత్ తన పూర్వ వైభవాన్ని చాటుతున్నాడు. విదేశాల్లో తనకున్న చెత్త రికార్డుని మెరుగుపర్చుకుంటూ భారీ స్కోర్లు చేస్తున్నాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన హిట్ మ్యాన్.. ప్రస్తుతం ట్రినిడాడ్ లో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ (80)తో సత్తా చాటాడు. ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
సాధారణంగా స్వదేశీ పిచ్ ల మీద చెలరేగే రోహిత్ శర్మ విదేశాల్లో పేలవ రికార్డ్ ఉంది. అయితే ప్రస్తుతం బలహీనంగా ఉన్న విండీస్ జట్టుని మన టీమిండియా బ్యాటర్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అదే పనిగా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు భారత మాజీ కెప్టెన్ ధోనీ రికార్డుని దాటేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వారి లిస్టులో రోహిత్ టాప్ 5 లో స్థానం సంపాదించాడు. సచిన్ టెండూల్కర్ 34357 పరుగులతో ఈ లిస్టులో టాప్‌లో ఉంటే విరాట్ కోహ్లీ 25461 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా పని చేస్తున్న రాహుల్ ద్రావిడ్ 24208 పరుగులతో టాప్ 3లో ఉంటే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 18,575 అంతర్జాతీయ పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
అయితే ఇప్పటివరకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 17266 అంతర్జాతీయ పరుగులతో 5 వ స్థానంలో ఉంటే తాజాగా రోహిత్ శర్మ ఆ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో చేసిన పరుగులతో 17300 పూర్తి చేసుకొని ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీలను వెనక్కి నెట్టేశాడు. ఈ ఫామ్ ఇలాగే కొనసాగిస్తే మాజీ కెప్టెన్ గంగూలీని చాలా ఈజీగా దాటే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా 4 వికెట్లకు 288 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(80), జైస్వాల్ (57) వరుసగా రెండో సారి కూడా సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాకు మంచి ఆరంభమే ఇచ్చారు. గిల్, రహానే మరోసారి విఫలమైనా విరాట్ కోహ్లీ(87), జడేజా (36) జట్టుని ఆదుకున్నారు. మొత్తానికి అత్యధిక పరుగులు చేసిన వారిలో టాప్ 5 లో స్థానం సంపాదిన్చుకున్న రోహిత్ శర్మ రికార్డ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.