SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Lost Match Against West Indies Because Of Rohit Sharma Bad Captaincy

టీమిండియా ఓటమికి రోహిత్‌ చెత్త కెప్టెన్సీనే కారణం! మండిపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 2 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీమిండియా ఓటమికి రోహిత్‌ చెత్త కెప్టెన్సీనే కారణం! మండిపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

విండీస్‌ టూర్‌లో టీమిండియా వరస విజయాలకు బ్రేక్‌ పడింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించిన రోహిత్ సేన రెండో టీ20లో తేలిపోయింది. విచిత్ర కారణాలతో సోమవారం మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమైనా.. చివర్లో రోహిత్‌ శర్మ చెత్త కెప్టెన్సీ కారణంగానే టీమిండియా ఓడిపోయిందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు.

సీనియర్‌ బౌలర్‌ డెత్త్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు రెండు ఓవర్లు ఉంచుకుని.. హార్దిక్‌ పాండ్యాకు 18వ ఓవర్‌, ఆవేశ్‌ ఖాన్‌కు 20వ ఓవర్‌ ఇవ్వడంతో రోహిత్‌ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఫోర్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లంతా విఫలయ్యారు. ఒబెడ్ మెక్కాయ్‌ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించాడు.

rohith sharma

ఈ లెఫ్టార్మ్ పేసర్‌ ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్‌ ఫస్ట్ బాల్‌కే రోహిత్ శర్మ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్(11), శ్రేయస్ అయ్యర్(10) కెప్టెన్‌ను అనుసరించారు. రిషభ్ పంత్(24), హార్దిక్ కొంత పోరాడినా హోస్సెన్ దెబ్బతీసాడు. చివర్లో అశ్విన్, కార్తీక్ కూడా విఫలమవడంతో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. మెక్కాయ్‌ 6 వికెట్లతో పాటు హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హోస్సెన్, జోసఫ్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది.

ఓపెనర్ బ్రాండన్ కింగ్(52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68)హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవన్ థామస్(19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కైల్ మేయర్స్(8), నికోలస్ పూరన్(14), షిమ్రాన్ హెట్‌మైర్(6), రోవ్‌మన్ పొవెల్(5) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జడేజా, అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. స్వల్ప లక్ష్యమే అయినా మ్యాచ్‌ను భారత్ ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లింది.

rohith sharma

చివరి మూడు ఓవర్లలో విండీస్ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. 18వ ఓవర్ వేసిన హార్దిక్ 11 పరుగులిచ్చాడు. ఇక 19వ ఓవర్ వేసిన అర్షదీప్.. డేంజరస్ పోవె‌ల్‌ను ఔట్ చేయడంతో పాటు 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆశలు రేకెత్తాయి. చివరి ఓవర్‌ను భువనేశ్వర్‌ కుమార్‌ వేస్తాడని అంతా భావించారు. కానీ.. ఆశ్చర్యకరంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బంతిని ఆవేశ్‌ ఖాన్‌ చేతికి ఇచ్చాడు. చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. ఆవేశ్ ఖాన్ తొలి బంతినే నోబాల్‌గా వేశాడు. దాంతో ఫ్రీ హిట్ అవకాశాన్ని అందుకున్న డెవన్ థామస్ భారీ సిక్సర్ బాదాడు. అదే జోరులో మరో బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. చివరి ఓవర్‌తో ఆవేశ్‌ఖాన్‌ అనుభవంలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది.

ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన భువీ కేవలం 12 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్‌ భువీ వేసి ఉంటే మ్యాచ్‌ ఫలితం వేరేలా ఉండేదని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి రోహిత్‌ శర్మ చెత్త కెప్టెన్సీనే కారణమని మండిపడుతున్నారు. కాగా.. భువీని కాదని ఆవేశ్‌ఖాన్‌కు చివరి ఓవర్‌ ఇవ్వడాన్ని రోహిత్‌ శర్మ సమర్ధించుకోవడం విశేషం. భువీ డెత్‌ ఓవర్స్‌లో ఎన్నో సార్లు అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ ఆవేశ్‌ ఖాన్‌ లాంటి యువ క్రికెటర్లకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అని పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Rare captaincy goof up by #RohitSharma having #aveshkhan to bowl the last over despite #BhuvaneshwarKumar being there. Could have saved the match. #IndvsWI #WIvsIND #indvwi

— Abhishek (@abhishaek) August 1, 2022

Indian Cricket Fans After Watching Rohit Sharma Asking Avesh Khan To Bowl The Crucial Last Over Instead Of Bhuvaneshwar Kumar.#RohitSharma #aveshkhan #WIvIND #WIvsIND #IndvsWI #INDvWIonFanCode #INDvWI pic.twitter.com/1gRMbaTrue

— Akshay (@realakshay5) August 1, 2022

Answered: Why did #RohitSharma go with #AveshKhan over Bhuvi in the final over?@BhogleHarsha & @Parthiv9 discuss, on #CricbuzzLive#WIvIND pic.twitter.com/opyWMFu7jd

— Cricbuzz (@cricbuzz) August 2, 2022

Tags :

  • Latest Cricket News
  • Rohit Sharma
  • Team India
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

  • WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

    ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

  • Rohit Sharma: ఆ ఒక్క కారణంగానే నేను, కోహ్లీ టీ 20లు ఆడట్లేదు: రోహిత్ శర్మ

    ఆ ఒక్క కారణంగానే నేను, కోహ్లీ టీ 20లు ఆడట్లేదు: రోహిత్ శర్మ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam