పుజారా.. టీమిండియాకు దొరికిన నయా వాల్. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పేరుతెచ్చుకున్న పుజారా అప్పుడే భారత్ తరఫున 100వ టెస్టు ఆడేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ స్పెషల్ మూమెంట్‌లో తన మనసులోని మాటను బయటపెట్టాడు.
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు. భారత్-ఆస్ట్రేలియా వేదికగా జరిగే రెండో టెస్టు పుజారాకు వందో టెస్టు. ఈ అరుదైన మైలు రాయిని చేరుకుంటున్న క్రమంలో మీడియాతో మాట్లాడిన పుజారా.. కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. 100వ టెస్టు ఆడబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ.. టీమిండియా కోసం తాను చేయాల్సిన ఒక ముఖ్యమైన పని గురించి, సాధించాల్సిన గొప్ప విజయం గురించి వెల్లడించాడు. భారత్‌కు టెస్టు ఛాంపియన్ షిప్ అందించడమే తన కల అని పుజారా తన మనసులో మాటను ఈ సందర్భంగా బయటపెట్టాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడినా.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. మరోసారి భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం ఉంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023లో భారత్ ఫైనల్ చేరాలంటే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-0 లేదా 3-1 తేడాతో కైవసం చేసుకోవాలి. ఇలా అయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. ఆ ఫైనల్లో విజయం సాధిస్తే.. టెస్టు ఛాంపియన్‌గా భారత్ అవతరిస్తుంది. ఇదే పుజారా లక్ష్యం. దీని కోసమే కృషి చేస్తానని, తన శక్తికి మించి మంచి ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నం చేస్తానని అన్నాడు. అయితే.. చాలా మంది క్రికెటర్లకు వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా ఉంటుంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఎన్ని గొప్ప రికార్డులు సాధించినా.. ఎన్ని మ్యాచ్‌లు ఒంటి చేత్తో గెలిపించినా.. టీమిండియా తరఫున వన్డే వరల్డ్ కప్ గెలవాలనే లక్ష్యంతో ఉండేవాడు. 2011లో సచిన్ కల నెరవేరింది. కానీ.. పుజారాకు మాత్రం భారత్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ అందించాలని కల కంటున్నాడు.
పుజారా టెస్టు టీమ్‌లో కీలక సభ్యుడు, అతని వన్డే, టీ20 జట్లలో ఆడే అవకాశం రావడం లేదు. దీంతో.. తాను ఏ ఫార్మాట్‌లో అయితే బలంగా ఉన్నాడో అదే ఫార్మాట్‌లో టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చాలని కల కంటున్నాడు. అయితే.. టెస్టు క్రికెట్‌లో నయా వాల్‌గా పేరు పొందిన పుజారా.. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన పుజారా.. 44.15 సగటుతోతో 7,021 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 5 వన్డేలు కూడా ఆడిన పుజారా.. 51 పరుగులు మాత్రమే చేశాడు. 242 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి.. 51.89 సగటుతో 18525 పరుగుల చేశాడు. అందులో 56 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలా టెస్టు క్రికెట్‌కు వన్నె తెచ్చిన ప్లేయర్‌గా పుజారా పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. అయితే.. భారత్‌ను టెస్ట్ ఛాంపియన్‌గా నిలపాలనే పుజారా కల నెరవేరుతుందో లేదో చూడాలి. మరి పుజారా డ్రీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TeamIndia batter @cheteshwar1 addressing the press conference in Delhi on the eve of his 100th Test match.#INDvAUS pic.twitter.com/mSzwUdLmek
— BCCI (@BCCI) February 16, 2023