టీమిండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ వర్మ.. శార్దుల్ ఠాకూర్ పెళ్లిలో రోహిత్ శర్మ, రితికా, శ్రేయస్, శార్ధుల్‌తో కలిసి ఫొటో దిగింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాహల్ జీవితం డేంజర్‌లో ఉందంటూ నెటిజన్లు అంటున్నారు..
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. సాధారణంగా క్రికెటర్లు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శనలు చేసినప్పుడు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంచుతారు. మరి వారం నుంచి చాహల్ ఎలాంటి క్రికెట్ మ్యాచ్ ఆడకపోయినా.. సడెన్‌గా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారిపోయాడు. ఇందుకు కారణం అతని భార్య ధనశ్రీ వర్మ. అందంతో పాటు మంచి డాన్సింగ్ టాలెంట్ ఉన్న ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ.. మంచి ఫాలోయింగ్‌నే సంపాదించుకుంది. ఫ్రెండ్స్‌తో చాలా సరదాగా ఉండే ధనశ్రీ.. వారితో రీల్స్ చేస్తూ.. వాటిని ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ ఉంటుంది. అందరితో చాలా సరదాగా ఉండే ధనశ్రీ టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో మరీ ఎక్కువ క్లోజ్‌గా ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా చాహల్ హెచ్చరిస్తున్నారు. దీంతో చాహల్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు.
అయితే.. గతంలోనూ కూడా శ్రేయస్ అయ్యర్-ధనశ్రీ మధ్య ఏదో నడుస్తుంది అని పుకార్లు వచ్చాయి. చాహల్ లేకుండా ధనశ్రీ అయ్యర్‌తో కలిసి పార్టీలకు వెళ్లిందంటూ.. సోషల్ మీడియాలో ఫొటోలు కొన్ని దర్శనమిచ్చాయి. ఈ విషయంలో చాహల్-ధనశ్రీ మధ్య తీవ్ర విభేదాలు వచ్చి, విషయం విడాకుల దాకా వెళ్లిందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ధనశ్రీ వర్మ తన పేరు చివర చాహల్ పేరును ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తొలగించడం, కొత్త జీవితం ప్రారంభం కాబోతుందంటూ చాహల్ పోస్టు చేయడంతో వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు నిజమేని నమ్మే స్థాయికి చేరాయి. కానీ.. అలాంటిదేం లేదంటూ.. అనవసరంగా తమ దాపత్య జీవితం గురించి ఊహగానాలు సృష్టించొద్దంటూ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. దీంతో వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేలిపోయింది.
కానీ.. తాజాగా టీమిండియా క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ పెళ్లికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ అతని భార్య రితికా, శ్రేయస్ అయ్యర్, ధనశ్రీ వర్మ హాజరయ్యారు. పెళ్లికొడుకు శార్దుల్‌తో కలిసి వీరు నలుగురు ఒక ఫొటో దిగారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ధనశ్రీ వర్మ.. చాహల్ ఎక్కడా?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది శ్రేయస్ అయ్యర్, చాహల్ కాపురంలో నిప్పులు పోస్తున్నాడంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చాహల్.. నువ్వు జాగ్రత్త పడకుంటే నీ జీవితం కూడా దినేష్ కార్తీక్‌లా అవుతుందని’ నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే.. పెళ్లిలో కలిసినప్పుడు ఏదో క్యాజువల్‌గా దిగిన ఫొటోను పట్టుకుని ఇలాంటి అర్థంలేని కామెంట్లు చేయడం సరికాదని, ధనశ్రీ- అయ్యర్ మంచి ఫ్రెండ్స్ అని అంతకుమించి ఏం లేదంటూ మరికొంతమంది అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shreyas Iyer won’t see heaven for ruining the married life of Yuzi Chahal pic.twitter.com/m84SaCoYcn
— Halsey 🇫🇮 (@meandmyself017) February 27, 2023
Where’s Yuzi chahal ??? 😭 Shreyas divorce karwake bnanega 🤣 pic.twitter.com/eT8CSVloZj
— bi2 (@unfunnybii2) February 27, 2023
Rohit Sharma and his wife Ritika Sajdeh, Shreyas Iyer & Yuzi Chahal’s wife Dhanashree in the Shardul Thakur’s Sangeet ceremony. pic.twitter.com/4bYve5xjYf
— CricketMAN2 (@ImTanujSingh) February 27, 2023
Aur chahal ko Photo kheenchne ke liye rakha hain🥲 pic.twitter.com/UoicW3a5kx
— P💕 (@KudiPatakhaa) February 27, 2023
Chahal life is in danger pic.twitter.com/LqifY3Exhb
— rhea 🌸 (@rheadayall) February 27, 2023