మంగళగిరిలో జనసేన పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అభివృద్ధిని పక్కనబెడుతున్నారని మండిపడ్డారు. రంగు రోడ్లు తప్పా ఏపీలో ఏం లేదని వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఇదే విధంగా నన్ను ఓ సారి గెలిపించి చూడండని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని అన్నారు. ఇక నాకు గనుక అధికారం ఇస్తే ప్రజలకు రక్షణ ఎలా కల్పించాలో మీకు కళ్లారా చూపిస్తానన్నారు పవన్ కళ్యాణ్. గతంలో నేను రెండు స్థానాల్లో ఓడిపోయానని, ఒకవేళ నేను గెలిచి ఉంటే గనుక కొన్ని అభివృద్ధి విషయంలో నేను ముందుండే వాడినని అన్నారు పవన్ కళ్యాణ్.