పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాకు క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ తన భార్య గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆయన ఎమోషనల్ అయ్యారు. తనను క్షమించమని భార్యను అడిగినట్లు ఆయన వెల్లడించారు. ఎందుకంటే?
ఏడాదికి రెండు సినిమాలు చేస్తే కోట్లు వచ్చి ఖాతాలో పడతాయి. ప్రకటనల మీద ఒక సంతకం చేస్తే వందల కోట్లు వచ్చి పడతాయి. ఖరీదైన జీవితం, గ్లామర్ ప్రపంచం, దర్జాగా ఎవరినీ పట్టించుకోకుండా కారవ్యాన్ లో కూర్చోవచ్చు. ప్రశాంతంగా ఏ గొడవలూ లేకుండా హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు. మహారాజులా బతకడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా గానీ అవేమీ సంతృప్తినివ్వని పేదవాడు పవన్ కళ్యాణ్. అందుకే మహారాజులాంటి జీవితం వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పాలిటిక్స్ లో విమర్శలు అనేవి మామూలే. నీళ్లు పారే చోట బురద నీరు ఏర్పడడం సహజమే. పవన్ మీద బురద జల్లేవారు ఉంటారు. ఎక్కడైనా ఏ రంగంలో అయినా మంచి, చెడు అనేవి ఉంటాయి. పాలిటిక్స్ లోనూ అంతే.
ఇవన్నీ ఉంటాయని తెలిసే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చాలా సార్లు చెప్పారు. అయితే తన వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తుంటే చాలా బాధగా ఉంటుందని అన్నారు. పవన్ భార్య గురించి వచ్చిన విమర్శలపై ఆయన స్పందించారు. నాకు పిల్లలున్నారని.. వారి మనసు కూడా గాయపడుతుందని ఆయన అన్నారు. వీళ్ళు అన్న మాటలకు తన భార్య కూడా ఏడుస్తుందని.. ఏడవకుండా ఎలా ఉంటుందని.. సర్దిచెప్పుకుని ముందుకెళ్తున్నా అని అన్నారు. నేను బాధ్యత తీసుకున్నా, వెనక్కి రాలేనని తన భార్యతో చెప్పానని అన్నారు. అలా చెప్పినప్పుడు నా భార్య ఏడవకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఏడుస్తుందని అన్నారు.
మొన్న కూడా నా భార్యను అదే చెప్పానని.. తప్పదు వెళ్లాల్సిందే.. ఉంటే ఉంటాను, పోతే పోతాను అని చెప్పానని అన్నారు. నా వల్ల నువ్వు మాటలు పడుతున్నావ్. దయచేసి నన్ను క్షమించు, అంతకు మించి తాను ఏమీ అడగలేకపోతున్నానని ఆయన భార్యకు క్షమాపణలు చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన జనసేన నాయకులు, వీర మహిళలతో మాట్లాడారు. తానొక విప్లవకారుడిలా ఆంధ్రప్రదేశ్ ని తట్టిలేపుతున్నానని అన్నారు. కాసేపటి తర్వాత ఆయన భార్య గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు కుటుంబం, పిల్లలు ఉంటారని.. ఎవరైనా ఏదైనా అంటే వారు బాధపడతారని.. తన భార్య కూడా ఏడుస్తుందని అన్నారు. తన వల్ల మాటలు పడుతున్న తన భార్యకు క్షమాపణలు చెప్పానని ఆయన అన్నారు. మరి పవన్ క్షమాపణలు చెప్పడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.