జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. నేటితో తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన వారాహి వాహనం మీద భారీ ర్యాలీగా మచిలీపట్నం బయలుదేరారు.
జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. పదవ ఏటలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం మచిలీపట్నంలో ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్ నుంచి విజయవాడ ఆటోనగర్ చేరుకున్నారు. కాసేపట్లో ఆటోనగర్ నుంచి వారాహి వాహనం మీద మచిలిపట్నం సభకు ర్యాలీగా బయలుదేరారు. మచిలీపట్నం సభకు వేలాది జనసైనికులతో ర్యాలీగా జనసేనాని పవన్ కళ్యాణ్ బయలుదేరారు. పవన్ ను చూసేందుకు ప్రజలు, అభిమానులు బిల్డింగ్స్, షాపులు ఎక్కారు. ఆటోనగర్ రోడ్లు జై జనసేన స్లోగన్స్ తో మార్మోగిపోతున్నాయి.
జనసేనాని రాకతో బెంజ్ సర్కిల్ నుంచి తాడిగడప వరకూ 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు బెంజ్ సర్కిల్ నుంచి ఆటోనగర్ వరకూ పవన్ కళ్యాణ్ వస్తున్న వాహనాలకు రూట్ క్లియర్ చేస్తున్నారు. కాగా 34 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసమే 30 ఎకరాలను కేటాయించారు. పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంగా అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. పవన్ ర్యాలీని విజయవంతం చేసేందుకు జనసేన అభిమానులు ఉరకలేసే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి తొలిసారిగా పవన్ వారాహి ఎక్కి ర్యాలీ చేపట్టడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.