ఏపీలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలికేందుకు చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబుతో పాటు పలువురు తాడేపల్లి వెళ్లి.. క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే అన్ని సమప్యలకు పరిష్కారం లభిస్తుందని భేటీ అనంతరం వారు మీడియాతో తెలిపారు. అయితే ఈ భేటీపై తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘‘సీఎం జగన్ సినిమా ఇండస్ట్రీ మీద కక్షతో వ్యవహరిస్తున్నారు. వాళ్ల పొట్ట మీద కొట్టి.. భయపెట్టారు. నిన్న జరిగింది చూస్తే.. ఇలా కూడా చేయ్యొచ్చా అని ఆశ్చర్యం వేసింది’’ అన్నారు చంద్రబాబు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను తొలుత సినిమాటోగ్రఫి మంత్రిని. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి, ప్రత్యేక ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేశాను. ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఎన్నడు ఇలా జరగలేదు. కానీ సీఎం జగన్.. నిన్న మొన్న సినిమా ఇండస్ట్రీలో సమస్యను సృష్టించి.. దాన్ని పరిష్కరించే నెపంతో వారితో ఏ విధంగా ఆడుకుంటున్నారో చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది’’ అన్నారు చంద్రాబాబు.
‘‘ఇండస్ట్రీలో ఎవరి పని వారు చేసుకుంటారు. అలాంటి వారందరిని సీఎం జగన్ కలబెట్టి.. వారి మీద కక్షతో వ్యవహరిస్తున్నాడు. నిన్న జరిగింది చూస్తే.. ఇలా కూడా చేయ్యొచ్చా అని ఆశ్చర్యం వేస్తుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాను.. కానీ ఇలా కూడా చేయ్యొచ్చా.. చేయించగల్గుతామా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇవన్ని నాకు తెలియదు. నేర్చుకుంటున్నాను’’ అన్నారు. జగన్ రెడ్డి ఏ విధంగా సినిమా వాళ్లను పొట్ట మీద కొట్టి.. మనుషల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో.. అతడి పాలనలో సాధారణ పౌరులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు అని చంద్రబాబు విమర్శించారు.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.