దసరా సినిమా నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన దసరా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాని మాస్ హిట్ సాధించిన నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. దసరా విజయానికి, జగన్‌ను విమర్శించడానికి సంబంధం ఏంటి అంటే..
తెలుగు వాళ్లకు, సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. భాషతో సంబంధం లేకపోయినా సరే సినిమా నచ్చిందంటే చాలు అక్కున చేర్చుకుంటారు. అందులో హీరోహీరోయిన్ ఇంతకు ముందే తెలుసా? లేదా అనే విషయం అస్సలు పట్టించుకోరు. ఈ మధ్య కాలంలో అలా హిట్టయిన సినిమా ‘కాంతార’. కేవలం కన్నడకే పరిమితమైన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఒరిజినల్ కంటే మన దగ్గర సూపర్ హిట్టయింది. రెగ్యులర్ చిత్రాలకు ధీటుగా వసూళ్లు సాధించింది. రూ.50 […]
నేషనల్ సినిమా డే… మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ.75కే సినిమా చూడొచ్చు. ఈ ప్రకటన రాగానే సినీ ప్రేమికులు తెగ ఆనందపడిపోయారు. ఎప్పుడు మల్టీప్లెక్స్ లకు వెళ్లని వారు కూడా.. ఆరోజు ఎలాగైనా అక్కడికి వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యారు. ఇప్పుడు ఈ విషయంలో దక్షిణాది ప్రేక్షకులకు అవమానం జరిగేలా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవహరించింది. దీంతో సినీ అభిమానులు.. దానిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఎందుకింత వ్యత్యాసం చూపిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
ఈ మధ్యకాలంలో థియేటర్లకు జనాలు రావడం లేదని అందుకే సినిమాలకు కలెక్షన్స్ లేవనేది కొందరి వాదన. కాదు.. సినిమాలలో కంటెంట్ ఉండటం లేదు.. కంటెంట్ ఉంటే జనాలు ఎలాగైనా థియేటర్లకు వస్తారనేది మరికొందరి వాదన. ఇక మీరెన్ని చెప్పినా.. థియేటర్లలో టికెట్ రేట్స్ ఎక్కువ అనుకుంటే.. అయినా ఫ్యామిలీతో వెళ్తే థియేటర్ లలో కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ ధరలే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనేది ఇంకొందరి వాదన. ఇన్ని వాదనల మధ్య సినిమా పరిశ్రమ ఎటు […]
సినిమా టికెట్ల రేట్ల అంశం ఏపీలో ఎంతటి రాజకీయా వివాదాన్ని రాజేసిందో అందరికి తెలిసిన సంగతి సంగతే. దాదాపు 2-3 నెలలు ఈ అంశం మీద ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీకి మధ్య చిన్న పాటి యుద్ధం జరిగిందనే చెప్పవచ్చు. చివరకు జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను నిర్ణయించేందుకు ఓ కమిటీని వేసి.. సమస్యను పరిష్కరించింది. ఆ సమయంలో సినిమా టికెట్ల రేట్లపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పక్క కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా, పరశురామ్ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి అటు సినీ వర్గాలలో, ఇటు సోషల్ మీడియాలో బజ్ విపరీతంగా క్రియేట్ అయింది. అలాగే ట్రైలర్ చూసేసరికి సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోయాయి. ఈ నేపథ్యంలో […]
మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆచార్య. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. హైదరాబాద్‌లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిపారు చిత్ర బృందం. ఇక సెన్సార్ రివ్యూలో ఆచార్యకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా కోసం మెగా అభిమానులు ఆత్రుతగా […]
కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్-2’. ఏప్రిల్ 14న(గురువారం) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కేజీఎఫ్-2 సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజులపాటు (ఏప్రిల్ 14 – ఏప్రిల్ 18) వరకూ టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ […]
ఏపీలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలికేందుకు చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబుతో పాటు పలువురు తాడేపల్లి వెళ్లి.. క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే అన్ని సమప్యలకు పరిష్కారం లభిస్తుందని భేటీ అనంతరం వారు మీడియాతో తెలిపారు. అయితే ఈ భేటీపై తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘‘సీఎం జగన్ సినిమా ఇండస్ట్రీ మీద కక్షతో వ్యవహరిస్తున్నారు. వాళ్ల […]
ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ ధరల వివాదం పై సీఎం జగన్ తో టాలీవుడ్ సినీ ప్రముఖులు మరోసారి సమావేశం అయ్యేందుకు రంగం సిద్ధమైంది. గత నెలలో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే సీఎం జగన్ తో చర్చించి.. ‘టికెట్ ధరల విషయమై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక రాగానే మరోసారి సమావేశం అవుతామని’ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ మంత్రి పేర్ని నాని అధ్యక్షతన నియమించిన కమిటీ నివేదిక సిద్ధం […]