సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పక్క కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా, పరశురామ్ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి అటు సినీ వర్గాలలో, ఇటు సోషల్ మీడియాలో బజ్ విపరీతంగా క్రియేట్ అయింది. అలాగే ట్రైలర్ చూసేసరికి సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోయాయి.
ఈ నేపథ్యంలో సర్కారు వారి చిత్ర బృందానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా రిలీజ్ అయిన రోజు నుండి అంటే మే 12 నుండి 18 వరకు ధరలు పెంచుకోవచ్చని తెలిపింది. వారం రోజులపాటు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ. 50 పెంచుకునేందుకు అనుమతివ్వగా.. ఏసీ సాధారణ థియేటర్లలో రూ.30 పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ , జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. మరి సర్కారు వారి పాట సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#SarkaruVaariPaata Nizam Ticket Hike Permission Granted 👍
Bookings Opens Soon 💣💥
Get Ready for SuperStar @urstrulyMahesh Mental Mass Swag 🤘❤️🔥#SVPMania #SVP pic.twitter.com/bfzAnwr55W
— Viswa CM (@ViswaCM1) May 9, 2022