మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆచార్య. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. హైదరాబాద్‌లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిపారు చిత్ర బృందం. ఇక సెన్సార్ రివ్యూలో ఆచార్యకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా కోసం మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే తండ్రికుమారులిద్దరూ.. తెర మీద ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేయబోతున్నారు.
ఇది కూడా చదవండి: ఆచార్యలో కాజల్ అగర్వాల్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కొరటాల!
ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతున్న ఆచార్య సినిమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొదటి వారం రోజుల పాటు సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది. సింగిల్ స్క్రీన్స్‌లో అయితే 30 రూపాయల వరకు పెంచుకోవచ్చని.. అంటే టికెట్ ధర 210-212 రూపాయల వరకు ఉండవచ్చని.. మల్టీప్లెక్స్‌లో అయితే 50 రూపాయల వరకు పెంచుకుని.. సినిమా టికెట్ ధర 354-350 వరకు ఉండేందుకు అనుమతిచ్చింది. అంతేకాక వారం రోజుల పాటు ఆచార్య సినిమాను ఐదు షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు.. ఉదయం 7 గంటల నుంచి తెల్లవారు జామున 1 గంట వరకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: హీరోయిన్ కంగనా షాకింగ్ కామెంట్స్! అతను నన్ను లైంగికంగా వేధించాడు!
మార్చిలో విడుదలైన RRR, KGF చిత్రాలకు కూడా టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆచార్య సినిమాకు కూడా సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Acharya Nizam special hike granted for 1st week.
Rates :
Single screens – 210/212
Multiplex – 354/350 #AcharyaOnApril29th ! pic.twitter.com/sLdRNrfjLQ— Kumar 🙂 (@MSKumar143) April 25, 2022
ఇది కూడా చదవండి: ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల అరెస్ట్.. 14 రోజులు రిమాండ్!