నేషనల్ సినిమా డే… మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ.75కే సినిమా చూడొచ్చు. ఈ ప్రకటన రాగానే సినీ ప్రేమికులు తెగ ఆనందపడిపోయారు. ఎప్పుడు మల్టీప్లెక్స్ లకు వెళ్లని వారు కూడా.. ఆరోజు ఎలాగైనా అక్కడికి వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యారు. ఇప్పుడు ఈ విషయంలో దక్షిణాది ప్రేక్షకులకు అవమానం జరిగేలా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవహరించింది. దీంతో సినీ అభిమానులు.. దానిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఎందుకింత వ్యత్యాసం చూపిస్తున్నారని మండిపడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2020 మార్చి ముందు వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కళకళలాడేది. ఎప్పుడైతే కరోనా మన జీవితాల్లోకి ఎంటరైందో సీనే మారిపోయింది. కొన్నాళ్లపాటు థియేటర్స్ మూసేశారు. ఆ తర్వాత తెరిచినా సరే చాలామంది థియేటర్ కి వెళ్లే సాహసం చేయలేదు. సరిగ్గా అలాంటి సమయంలో తెలుగు ఆడియెన్స్.. ఇండస్ట్రీని ఆదుకున్నారు. దేశంలో ఎవరూ చేయని సాహసం చేసి సినిమాను బతికించారు. అది చిన్నదా పెద్దదా అని చూడకుండా బాగున్న ప్రతి చిత్రాన్ని ఆదరించారు.
తెలుగు ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా దక్షిణాది ఆడియెన్స్ ఇచ్చిన సహకారం.. కరోనా వేవ్స్ తర్వాత సినీ ఇండస్ట్రీ మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా చేసింది. ఈ విషయం సినిమా గురించి తెలిసిన ఎవరిని అడిగినా సరే చెబుతారు. కానీ ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులకు అన్యాయం జరిగింది. నేషనల్ సినిమా డేని ఈ ఏడాది సెప్టెంబరు 16న జరపాలని తొలుత అనుకున్నారు. కానీ పలు కారణాలు వల్ల దానిని కాస్త 23వ తేదీకి మార్చారు. అక్కడ వరకు బాగానే ఉంది కానీ దక్షిణాది ప్రేక్షకులకు ఇది వర్తించదని ఇప్పుడు అంటున్నారు.
#NationalCinemaDay: ₹75 per ticket on coming Friday is valid in almost all states apart from Andhra Pradesh, Telangana, Tamilnadu & Kerala. @_PVRCinemas, @INOXMovies, @IndiaCinepolis, @MAofIndia, movie lovers from these four states deserve an explanation from you guys..
— Aakashavaani (@TheAakashavaani) September 21, 2022
మల్టీప్లెక్స్ అసోసియేషన్ చెబుతున్న కారణాల ప్రకారం.. లైసెన్సింగ్, అడ్మినిస్ట్రేటివ్ లిమిటేషన్స్ వల్ల దక్షిణాదిలో దీనిని అమలు చేయలేకపోతున్నామని మల్టీపెక్స్ అసోసియేషన్ అంటోంది. బుక్ మై షో యాప్ లో కూడా ఉత్తరాదిలో రూ.75 చూపిస్తుంటే.. మనకొచ్చేసరికి మాత్రం ఎప్పుడూ ఉండే ధరలే చూపిస్తోంది. ఇకపోతే దక్షిణాది రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే టికెట్ రేట్స్ విషయంలో నిబంధనలు ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణ, తమిళనాడు, కేరళ విషయంలో ఏమైందని ప్రశ్నిస్తున్నారు. నార్త్-సౌత్ అని ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారని అభిమానులు ఏకిపారేస్తున్నారు. మరి ఈ గొడవపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: రాజకీయాలకి దూరంగా ఉన్నా! నా నుంచి రాజకీయం దూరం కాలేదు: చిరంజీవి!