హైదరాబాద్- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రిరిలీజ్ కార్యక్రమంలో పవన్ చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.
పవన్.. నీ రెమ్యునరేషన్ 10 కోట్లా.. 50 కోట్లా అని పోసాని సూటిగా ప్రశ్నించారు. పవన్ సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.. అదే నేను ఒక్క సినిమా 15 కోట్ల చొప్పున ఇస్తాను, 4 సినిమాలకు సంతకం చేస్తాడా.. అని పోసాని అడిగారు. ఆయన చేసే సినిమాలోని హీరోయిన్ ను, లోకేషన్, పారితోషికం, కథ తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంటాడు.. తన సినిమాలకు 50 కోట్లు తీసుకోవట్లేదని పవన్ నిరూపిస్తే.. నన్ను చెంపదెబ్బ కొట్టండి.. అని పోసాని ఘాటుగా స్పందించారు.
అంతే కాదు పవన్ కల్యాణ్ సినిమా అంటే టిక్కెట్‌కు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వసూళ్లు చేయడమంటే ఏంటని పోసాని ప్రశ్నించారు. అది మధ్య తరగతి, సామాన్యులను హింసించడమే కదా అని వ్యాఖ్యానించారు. హీరోలు అంటే ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లని, వారు ఏనాడు డిస్ట్రిబ్యూషన్ విషయంలో, డబ్బు విషయంలో వేలు పెట్టెవారు కాదని పోసాని అన్నారు. వాళ్లు తెరమీదే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరోలని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి సంస్కారవంతుడని, ఆయనను చూసి పవన్ నేర్చుకోవాలని పోసాని హితువు పలికారు.
ఆనాడు చిరంజీవి ఇంట్లోని అడపడుచులను అసాసినెట్ చేస్తే పవన్ ఎక్కడ ప్రస్నించారని నిలదీశారు. ఇక సీఎం జగన్‌కు కులపిచ్చి ఉందని పవన్ కల్యాణ్ నిరూపిస్తారా.. అని పోసాని ప్రశ్నించారు. సినిమా ఫంక్షన్‌లో ముఖ్యమంత్రిని ప్రశ్నించడమేంటి అని కామెంట్ చేశారు. సాక్ష్యాలు లేకుండా పవన్ ప్రశ్నించడం సరికాదని పోసాని కృష్ణమురళి అన్నారు. పవన్‌కల్యాణ్ వాడిన భాష అభ్యంతరకమని పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు.