ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలను.. ఎంతో ఆసక్తి కరమైన సంఘటనలను చూస్తున్నాం. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఎంతగా అంటే ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రినే ఫిదా చేసింది. ఇంతకీ ఆ వీడియో ఏంటి.. దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందామా.
మనిషికి కృషీ.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏముందీ అన్నది నిజం చేస్తూ.. వయసుకు ఏదీ అడ్డుకాదు అని ఓ బామ్మ నిరూపించింది. 90 ఏళ్ల వయస్సులో కారు డ్రైవింగ్ నేర్చుకుంది. కేవలం రోజుల వ్యవధిలోనే డ్రైవింగ్ నేర్చుకుని హైవేపై రయ్‌మంటూ దూసుకెళ్లింది. బామ్మ కార్ డ్రైవింగ్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తుండగా.. కొందరు వ్యక్తులు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త తెగ వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన 90 ఏళ్ల బామ్మ రేష్మీ బాయ్ తన్వర్. సాధారణంగా ఎవరైనా కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని 90 ఏళ్ల వయసులో కృష్ణా.. రామా జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. కానీ రేష్మీ బాయ్ అందుకు భిన్నంగా కారు డ్రైవింగ్ నేర్చుకొని హైవే పై ఎంతో నైపుణ్యంతో Maruti 800 (మారుతి 800) కారును డ్రైవ్ చేస్తుంది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది.
ఈ వీడియో కేవలం సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి “శివరాజ్ సింగ్ చౌహాన్” ను ఆకర్షించింది. ఈ వీడియోను అతడు అతని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. స్వయం కృషితో ఏదైనా నేర్చుకోవడానికి వయసుతో సంబంధం అవసరం లేదు. ఇంత వయసులో కూడా కారుని డ్రైవ్ హేయడం నిజంగా హర్షించదగ్గ విషయం అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేష్మీ బాయ్ మాట్లాడుతూ.. తన కుటుంబంలో దాదాపు అందరికి డ్రైవింగ్ తెలుసని, ఈ కారణంగా తానూ కూడా డ్రైవింగ్ నేర్చుకున్నానని ఆమె తెలిపింది. తనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని అందువల్లనే ఇది సాధ్యమయ్యిందని తెలిపింది. అంతే కాకుండా ఆ వృద్ధ మహిళ వద్ద కార్లు మరియు ట్రాక్టర్లు ఉన్నట్లు కూడా తెలిపింది. ఏది ఏమైనా 90 ఏళ్ల ప్రాయంలో కూడా చలాకీగా కారు డ్రైవ్ చేయడం అనేది అసాధారణ విషయం అని నెటిజన్లు బామ్మను తెగ పొగిడేస్తున్నారు.
#WATCH मध्य प्रदेश: देवास में एक 90 साल की रेशम बाई तंवर नाम की महिला कार चलाकर बुजुर्ग लोगों को इस उम्र में भी गाड़ी चलाने का संदेश दे रही हैं। pic.twitter.com/HldyVTANn2
— ANI_HindiNews (@AHindinews) September 23, 2021
