మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 75 ఏళ్లు దాటుతున్నా.. ఇంకా కొన్ని చోట్ల అంటరానితనం, కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. అణగారిన వర్గాల వరానికి సామాజికంగా హీనంగానే చూస్తున్నారు. ఇలాంటి కుల వివక్షత రూపు మాపేందుకు కొంత మంది రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వింత ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే జమీర్ ఖాన్ దళితుడైన స్వామి నారాయణ్‌కు భోజనం కలిపి తినిపించారు.
ఆ సమయంలో నారాయణ్ అడ్డు చెప్పబోగా ఆయన నోట్లో ఉన్న ఆహారాన్ని తీసుకొని తనకు తినిపించమని అన్నాడు. నారాయణ్ తన నోట్లు ఉన్న అన్నం తీసి ఎమ్మెల్యే జమీర్ ఖాన్ ని తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా జమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటికీ సమాజంలో కొన్ని చోట్ల ఈ కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. అందరికీ దీన్ని అరికట్టాల్సిన బాధ్యతు ఉంది. ఈ సమాజంలో అందరూ సమానమే అని అన్నారు.
ఈ వీడియో చూసిన చాలా మంది రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే దేశంలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతుంది.. ఇలాంటి సంఘటనలు చూసి అందరిలో మార్పు తెచ్చుకోవాలి.. ప్రతి ఒక్కరూ సమానమే అని అందరికీ చాటి చెప్పాలని అంటున్నారు నెటిజన్లు. ఈ ఘటన బెంగళూరులో పెద్ద సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.