స్వామీజీలు అంటే ఎంతో శాంతంగా ఉంటూ.. ప్రజలకు నీతి వాఖ్యాలు చెప్పాలి. పొరపాటున ఎవరైనా తప్పు చేసినా కూడా వారికి సర్దిచెప్పేలా ఉండాలి. ముఖ్యంగా శాంతిమూర్తుల్లా ఉండాలి. నలుగురికి మంచి మాటలు చెబుతుండాలి. సరైనా మార్గంలో వెళ్లాలంటూ మార్గనిర్దేశం చేసే వారిలా ఉండాలి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే స్వామీజీలు మాత్రం అలాంటి కోవకు చెందిన వారు మాత్రం కాదు. అసలు స్వామీజీ అనే పదానికే కళంకంలా మారారు. ఒక చిన్న మాటతో వీరి మధ్య మొదలైన వైరం బట్టలు విప్పి కొట్టుకునే దాకా వెళ్లింది. అదికూడా సింగపూర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారి తీసింది.
అసలు ఏం జరిగిందంటే.. తంజావూరు జిల్లా పుదుకొట్టైకి చెందిన రుద్ర సిద్ధర్ రాజ్ కుమార్ అనే స్వామీజీ లోకల్‌గా చాలా ఫేమస్. ఈయన రోగాలు నయం చేయడంలో దిట్ట అని పుదుకొట్టై, తంజావూరు ప్రాంతాల్లో మంచి పేరుంది. అయితే ఒక భక్తుడు తన తండ్రికి నయం చేయాలంటూ ఆయనని సింగపూర్ ఆహ్వానించాడు. భక్తుడు ఆహ్వానించిందే మొదలు రాజ్ కుమార్ సింగపూర్ వెళ్లాడు. పూజ చేసేందుకు భక్తుడి ఇంటికి వెళ్లేసరికి అక్కడ హల్క్ స్వామీజీ అనే మరో స్వామి కూడా ఉన్నాడు. అయితే రాజ్ కుమార్- హల్క్ స్వామి ఇద్దరూ కలిసి పూజ జరిపించారు. తర్వాత భక్తులను కలిసే ఆశీర్వదించారు.
అయితే తర్వాత హల్క్ స్వామి- రాజ్ కుమార్ స్వాములకు మధ్య ఒక చర్చ వచ్చింది. అదే ఎవరు గొప్ప అని. అప్పుడు రాజ్ కుమార్ స్వామి తానే గొప్ప అంటూ బీరాలు పలికాడు. అప్పుడు హల్క్ స్వామికి చిర్రెత్తుకొచ్చి.. రాజ్ కుమార్ మెడలో ఉన్న టవల్ గట్టిగా పట్టుకున్నాడు. కాసేపు వారి మధ్య వాదన జరిగింది. తర్వాత రాజ్ కుమార్ ఇంటి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో హల్క్ స్వామి అతని పంచ లాగేశాడు. రాజ్ కుమార్ స్వామి దుస్తులు లేకుండానే రోడ్డు మీదకు వెళ్లి కారు ఎక్కాడు. వీరి మధ్య జరిగిన వాదన, గొడవ, దుస్తులు లాగేసి ఇంట్లో నుంచి పంపేయడం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్వామీజీల ముష్టియుద్ధంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.