సోషల్ మీడీయాలో రోజూ లక్షలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటే కొన్ని మాత్రం చాలా వైరల్ అవుతుంటాయి. అందుకే కొందరు రాత్రికి రాత్రి పాపులర్ అయిపోతుంటారు. ఈ టీచర్ ఇప్పుడు అలానే హల్‌చల్ చేస్తున్నాడు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఫిదా కావల్సిందే..
సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో చాలా వైరల్ అవుతోంది. సరదా కోసం చేశాడో లేక విద్యార్ధులకు డ్యాన్స్ నేర్పించడానికో తెలియదు గానీ ఆ ఉపాధ్యాయుడి క్లాస్ రూమ్ డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. తోటి విద్యార్ధులతో కలిసి వేసిన డ్యాన్స్ స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. తాళ్ సినిమాలోని తాల్ సే తాల్ మిలా…పాటకు వేసిన స్టెప్పులు అదరగొడుతున్నాయి. ఈ పాటకు అతను ఎంత వేగంగా డ్యాన్స్ వేశాడో చూస్తే మతి పోతుంది. చూస్తూ ఉండిపోవాలన్పిస్తుంది.
కొన్ని పాఠశాలల్లో ఇతర బోధనాంశాలతో పాటు డ్యాన్స్ కూడా ఉంటుంది. సరైన టీచర్ ఉంటే ఇక ఆ విద్యార్ధులకు పండగే. బహుశా ఈ వీడియోలో ఉన్నట్టువంటి టీచర్ మరెవరికీ లభించకపోవచ్చు. వీడియోలో విద్యార్ధులకు డ్యాన్స్ నేర్పిస్తూ స్టెప్పులేసిన తీరు అద్భుతంగా ఉంది. అటు విద్యార్ధినులు కూడా అచ్చం ఆ ఉపాధ్యాయుడు వేసినట్టే స్టెప్పులేసి అనుకరించారు. అందుకే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో అప్‌లోడ్ అయిన కాస్సేపటికే వైరల్ అవసాగింది. ఇప్పటికే 3 లక్షల వ్యూస్ దాటేశాయి. నెటిజన్లు కూడా తమకు నచ్చినట్టుగా కామెంట్లు అందుకుంటున్నారు. ఇలాంటి డ్యాన్స్ టీచర్ మాకు దొరికుంటే బాగుండేదంటున్నారు. తాళ్ సినిమా పాట మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్‌లో విన్పిస్తుండగా చేసిన డ్యాన్స్ ఇంకా వైరల్ అవుతూనే ఉంది.