రాసిపెట్టుంటే ఏదీ ఆగదు. అదృష్టం ఉంటే ఎవరూ తప్పించలేరు. దురదృష్టం వెంటాడితే ఎవరూ ఆపలేరు. అతనంత లక్కీ ఫెలో మరెవరూ ఉండరు. ఆమె అంత దురదృష్టవంతురాలు మరొకరుండరు. అవును..ఇది ముమ్మాటికీ నిజం. అసలేమైందంటే..
దేవుడు ముందే రాసిపెట్టేస్తాడంటారు ఎవరికెంత ప్రాప్తమనేది. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో కూడా రాసేస్తాడు. డెస్టినీ ఇది.. నమ్మాల్సిందే అంటారు చాలామంది. ఎవరైనా దీనిని నమ్మకుంటే నిజంగా జరిగిన ఈ ఘటన వింటే నమ్మవచ్చు. ఈ ఘటన గురించి తెలుసుకుంటే ఆమె నెత్తిన శని ఎంతలా తిష్టవేసిందో..అతనెంత సుడివంతుడో అర్ధమౌతుంది. అందుకే అంటారు రాసిపెట్టుంటే ఏది ఎప్పుడు ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. ఎవరూ తప్పించలేరని. నెత్తిన శని తిష్టవేస్తే వచ్చే అదృష్టం ఎలా కన్పిస్తుందామెకు.
ఈ సంఘటన న్యూజెర్సీలో జరిగింది. మైక్ వీరెన్కీకు పెళ్లయి దాదాపుగా 15 ఏళ్లు గడిచిపోయాయి. పెళ్లయినప్పటి నుంచి భర్తకు సరైన ఉద్యోగమే లేదు. ఏదో ఒకటి చేసుకుని బతుకుదామంటే అంత ఓపిక కూడా లేదు. ఫలితంగా కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాడంటూ అతని భార్య విడాకులు కోరుతూ కోర్టుని ఆశ్రయించింది. కోర్టు కూడా ఆమె బాధలు చూసి విడాకులు మంజూరు చేయడంతో భర్త నుంచి ఎంతొస్తే అంత తీసుకుని దూరమైంది. అంతే ఆ తరువాత పెద్ద అద్భుతమే జరిగింది.
ఏదో సందర్భంలో మైక్ వీరెన్కీ కొన్న లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ ప్రైజ్ తగిలింది. లాటరీలో ఏకంగా 2.28 వేల కోట్లు వచ్చాయి. అవును నిజమే…అక్షరాలా 2 వేల కోట్లు పైనే. అంతే అతడి ఆనందానికి హద్దుల్లేవు. అతని జీవితం నుంచి ఆమె ఇలా వెళ్లిందో లేదే భర్త బిలియనీర్ అయిపోయాడు. ఇది తెలిసిన ఆమె మళ్లీ అతడి జీవితంలో వస్తుందో లేదో..వచ్చినా అతడు స్వీకరిస్తాడా లేదా అనేది తెలియకపోయినా నెటిజన్లు మాత్రం డబుల్ జాక్‌పాట్ కొట్టేశావ్ అంటున్నారు. నీ డబ్బు చూసి నీ భార్య మళ్లీ వస్తుంది చూడంటున్నారు. అదృష్టం వర్సెస్ దురదృష్టం అంటే ఇదే మరి.