మనం నిత్యం పనుల మీద బయటకు వెళ్తుంటాము. అయితే ఇలా వెళ్లిన సమయంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుక వస్తుందో చెప్పలేము. మరీ ముఖ్యంగా వాహనాల రూపంలో అనేక ప్రమాదాలు దూసుకొస్తుంటాయి. ఎంతలా అంటే చివరకి ఆ వాహనాలు షాపింగ్ మాల్ లోకి వచ్చి మరి మనుషులను ప్రమాదానికి గురిచేస్తుంది. తాజాగా ఓ కారు షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లి..అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఢీకొట్టింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అమెరికాలోని టెంపే నగరంలో ఓ షాపింగ్ మాల్ వద్దకు తెల్ల రంగులో ఉన్న కారు వచ్చి ఆగింది. తిరిగి కారును తీసే క్రమంలో డ్రైవర్ బ్రేక్‌పై కాలు వేయబోయి ఏక్సలరేటర్‌పై వేశాడు. దీంతో ఆ కారు ఒక్కసారిగా షాపింగ్ మాల్ ప్రవేశ ద్వారం నుంచి లోనికి దూసుకెళ్లింది. లోపల పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ షాపింగ్ మాల్‌లో వస్తువులున్న కొన్ని ర్యాక్‌లను ధ్వంసమయ్యాయి. అయితే ఈ ర్యాక్‌లు ఉండటంతో ఆ ఇద్దరు ఉద్యోగులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: విషాదం: చర్చిలో జరిగిన తొక్కిసలాట.. 31 మంది మృతి!ఈ ఘటనపై సమాచారం అందుకున్న టెంపే నగర పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఈ ప్రమాదం వల్ల కొన్ని ర్యాక్‌లు ధ్వంసమయ్యాయని షాపింగ్ మాల్ యజమాని తెలిపాడు. ఈ నేపథ్యంలో రిపేర్ కోసం కొన్ని రోజుల పాటు షాపింగ్ మాల్‌ను మూసివేస్తున్నట్లు చెప్పాడు. మరోవైపు షాపింగ్ మాల్‌లోకి కారు దూసుకెళ్లి ఇద్దరు ఉద్యోగులను ఢీకొట్టిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Wow check out this close call!! The driver accidentally left the car in drive and tries to put it in park and unintentionally hit the accelerator. Thankfully only minor injuries! pic.twitter.com/03OWUN9o6c
— Tempe Police (@TempePolice) May 26, 2022