ఒక యంత్రం పనిచేయాలంటే దానిలోని ప్రతిభాగం ఎంత ముఖ్యమో అదే విధంగా మానవునిలో కూడా జీవక్రియలు సక్రమంగా జరగాలంటే ప్రతి అవయవం అంతే స్థాయిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఏ అవయవంపాడైన కూడా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.
ఒక యంత్రం పనిచేయాలంటే దానిలోని ప్రతిభాగం ఎంత ముఖ్యమో అదే విధంగా మానవునిలో కూడా జీవక్రియలు సక్రమంగా జరగాలంటే ప్రతి అవయవం అంతే స్థాయిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఏ అవయవంపాడైన కూడా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యనిపుణులు ఎప్పుడూ సూచిస్తుంటారు. అయితే మారుతున్న కాలం, జీవన విధానంలో చోటుచేసుకున్న మార్పులు ఇవన్నీ కూడా ఆరోగ్యంపై పెనుప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. డయాలసిస్ చేయించుకుని కాలం వెల్లదీస్తున్నది కొందరైతే.. కిడ్నీ డోనర్ కోసం ఎదురుచూసే వారు కొందరు. ఇలాంటి సమయంలో వైద్యులు చేసిన ఆ పని ఊరటనిస్తోంది. మనిషికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చి పరీక్షించారు. ఆ ప్రయోగం విజయవంతం అవ్వడంతో మనిషి ప్రాణాలను కాపాడడంలో పందులు కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా కిడ్నీ వ్యాధితో బాధపడే వారు కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అంత సులువుగా కీడ్నీ డోనర్ లభించరు. అలాంటివారికి న్యూయార్క్ వైద్య పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. జన్యు మార్పిడి చేసిన జంతువు కిడ్నీని బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తికి అమర్చి విజయవంతంగా పరీక్షించినట్టు వైద్యులు తెలిపారు. నెల రోజులకుపైగా కిడ్నీ విజయవంతంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి న్యూయార్క్‌లోని లాంగోన్స్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా. రాబర్ట్ మోంట్‌గోమోరి ఆధ్వర్యంలో పరిశోధనలు జరిపారు.
ఈ క్రమంలో అమెరికాలో ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్ కాగా కుటుంబ సభ్యుల అనుమతితో అతని శరీరంపై పరిశోధనలు చేసి, పంది కిడ్నీని సేకరించి దాని జన్యువుల్లో మార్పులు చేసి అతనికి అమర్చారు. అయితే అది పని చేయడం ప్రారంభించి, మూత్రాన్ని ఉత్పత్తి చేయడాన్ని పరిశోధకులు గుర్తించారు. సమర్థవంతంగా కిడ్నీ పనిచేస్తుందని ప్రొఫెసర్ రాబర్ట్ మోంట్‌గోమోరి తెలిపారు. ఈ పరిశోధనలు సక్సెస్ అయితే భవిష్యత్తులో పంది కిడ్నీ మనుషుల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా మరానుందనడంలో ఎటువంటి సందేహం లేదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.