దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7. తీవ్రత నమోదవడంతో సునామీ హెచ్చరిక కూడా జారీ అయింది. భూకంపం తీవ్రతను తొలుత 8గా భావించినా ఆ తరువాత 7.5గా ప్రకటించారు. భూకంపం ప్రభావం అంటార్కిటికాపై తీవ్రంగా పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాసేజ్ ప్రాంతంలో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7. తీవ్రత నమోదైనట్టు అమెరికన్ జియలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.5 ఉంటే సునామీ హెచ్చరిక జారీ చేస్తుంటారు. కానీ అమెరికా సునామీ వార్నింగ్ సెంటర్ ఎలాంటి వార్నింగ్ చేయలేదు. చిలీ ప్రభుత్వం మాత్రం అలర్ట్ ప్రకటించింది. భూకంపం భూమికి 10.8 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇప్పటికే ఈ ప్రాంతం తరచూ భూకంపాలకు ప్రభావితమౌతూ ఉంటోంది. టెక్టానిక్ ప్లేట్ల జంక్షన్‌లో ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ లేదా ఆస్థి నష్టం జరిగినట్టు ఇంకా సమాచారం లేదు.
అంటార్కిటికా చీలిందా
అత్యంత శక్తివంతమైన భూకంపం టెక్టానిక్ ప్లేట్ల జంక్షన్ ప్రాంతంలో సంభవించడంతో అంటార్కిటికాపై తీవ్రంగా ప్రభావం పడింది. దాంతో మంచు ఫలకాల్లో భారీ చీలిక వచ్చి మొత్తం కదిలిపోయింది. డ్రెక్ పాసేజ్ పూర్తిగా అస్తవ్యస్థమైంది. అర్జెంటీనీ దక్షిణ నగరం ఉషుయ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించారు. డ్రెక్ పాసేజ్ అనేది దాదాపుగా 1000 కిలోమీటర్ల వెడల్పులో ఉన్న సముద్రమార్గం. ఇది చిలీలోని కేప్ హార్న్, అంటార్కిటికాలోని సౌత్ షెట్లాండ్ దీవుల మధ్యలో ఉండి నైరుతి అట్లాంటిక్ మహా సముద్రాన్ని ఆగ్నేయ పసిఫిక్ మహా సముద్రంతో కలుపుతుంది.
అందుకే ఈ ప్రాంతంలో భూకంపం సంభవించడం వల్ల మంచు ఫలకాల్లో భారీ చీలిక ఏర్పడిందని తెలుస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైందిగా భావిస్తున్నారు. దక్షిణ అమెరికా నుంచి అంటార్కిటిగా ఖండం విడిపోవడానికి ఇలాంటి భూకంపాలే కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డ్రెక్ పాసేజ్ ప్రాంతంలో సముద్రం ఎప్పుడూ తీవ్ర స్థాయిలో అల్లకల్లోలంగా ఉంటుంది.