టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా వెళ్లిన ఆయన సర్జరీ కోసమే వెళ్లారని తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తనదైన గ్రేస్ స్టెప్‌లతో అలరిస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. తెరపై కనపడితే ఫ్యాన్స్‌కి పూనకాలె అని చెప్పాలి. యంగ్ హీరోస్ కి ఏమాత్రం తగ్గకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవికి సంబంధించిన ఒ విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవికి సర్జరీ జరిగిందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందుకోసమే అమెరికా వెళ్లినట్లు వార్తలు బయటకి వచ్చాయి. దీంతో.. ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
బోళా శంకర్ మూవీ పూర్తి కావడంతో భార్యతో కలిసి అమెరికా ట్రిప్ వేశారు చిరంజీవి. ఇందుకు సంబందిచిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే విహారయాత్రకు వెళ్లారేమో అనుకున్నారంతా కానీ.. ఆయన సర్జరీ కోసం వెళ్లారని తాజాగా బయటకు వచ్చింది. కాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. ఇది సీక్రెట్ గా ఉన్నప్పటికి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితె దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసంరం లేదని కాలికి చిన్న సర్జరీ మాత్రమే జరిగిందని కొందరు సినీ ప్రముఖుల ద్వారా బయటకు వచ్చింది. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి నిజం లేదట. మెగాస్టార్ కు అసలు ఎలాంటి సర్జరీ జరగలేదు అని తెలుస్తోంది.
ఇక ఎయిర్ పోర్ట్‌లో చిరంజీవి జాలీగా నడుస్తూ వెళ్లడం చూశాం. కాబట్టి మెగా అభిమానులు ఎలాంటి కలత చెందాల్సిన అవరసరం లేదని చిరంజీవి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ హిట్ చిత్రం వేదాళంకి ఈ సినిమా రీమేక్. తమన్నా ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లిరికల్ సాంగ్స్ విడుదలకాగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.