అగ్రరాజ్యం అమెరికా వెళ్లి.. డాలర్లు సంపాదించాలని కొందరు కోరుకుంటే.. అక్కడే స్థిరపడాలని మరి కొందరు ఆశపడతారు. అమెరికాలో సెటిల్ అయిన భారతీయుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం వరకు అగ్రరాజ్యంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేవి. అయితే ఆర్థిక మాంద్యం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతర దేశాల వారి వల్ల.. తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ కొందరు అమెరికన్లు కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా అమెరికాలో జాతి వివక్ష దాడులు పెరుగుతున్నాయి. కొన్నెళ్ల క్రితం ఓ నల్లజాతీయుడి మీద అమెరికా పోలీసులు దాడి చేయడంతో అతడు మృతి చెందిన సంఘటన ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా భారతీయులకు అందునా మహిళలకు ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ అమెరికన్ మహిళ.. భారతీయ స్త్రీలను బూతులు తిడుతూ.. వారిపై దాడి చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆవివరాలు..
వివరాల ప్రకారం.. టెక్సాస్‌లో ఉన్న డల్లాస్‌లో భారతీయ మహిళలపై ఈ జాతివివక్ష దాడి జరిగింది. మెక్సికన్‌కు చెందిన మహిళ ఒకరు పార్కింగ్ లాట్‌లో ఉన్న ఇండియన్ మహిళలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై దాడి చేసింది. కాగా, నిందితురాలు.. ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూనే భారతీయ మహిళలను కొడుతూ.. బూతులు తిట్టింది. నేను ఎక్కడికి వెళ్లినా ఇండియన్స్ కనిపిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే భారత మహిళలను ఉద్దేశించి.. మీరు ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించింది. ఇండియాలో బెటర్ లైఫ్ లేకపోవడం వల్లే మీరు అమెరికాకు వస్తున్నారని ఆమె ఆరోపించింది. తాను భారతీయులను అమితంగా ద్వేషిస్తానని చెప్పుకొచ్చింది.
‘‘నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. కానీ, మీరు మాత్రం ఇండియాలో పుట్టి మా దేశానికి వస్తున్నారు. ఒకవేళ మీ దేశం ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్కడకి ఎందుకు వచ్చినట్లు.. మీరు మీ దేశం వెళ్లిపోండి.. ఇండియా వెళ్లిపోండి’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, మహిళలపై దాడి వీడియో అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీలో వైరల్‌గా మారింది. దీంతో, పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. కాగా భారతీయ మహిళలపై దాడి చేసిన మెక్సికన్ స్త్రీని ఎస్మరాల్డో ఉప్టన్‌గా గుర్తించారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This racist attacking these innocent women is Esmi Upton of Plano, Texas. Full name: Esmeralda Armendarez-Upton, she is a realtor for California Federal Bank. She is a parishioner at Prince of Peace Catholic Church in Plano, TX.
She wants to be famous for all the wrong reasons. pic.twitter.com/psYfOQpNW0
— Johnny Akzam (@JohnnyAkzam) August 25, 2022