నయనతార నటించిన ఓ2 సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో నయనతార సహా కొంతమంది బస్సులో ప్రయాణిస్తుంటారు. కొంత దూరం వెళ్ళాక కొండ చరియలు విరిగి పడడంతో రోడ్డు అకస్మాతుగా బీటలు వారి విడిపోయి పెద్ద గుంత ఏర్పడుతుంది. ఆ సమయంలో అటుగా వస్తున్న బస్సు ఆ గుంతలో పడిపోతుంది. అదే సమయంలో వర్షం కూడా కురవడంతో బస్సుపైన మట్టి కూరుకుపోయి సమాధిలా తయారవుతుంది. లోపలున్న వాళ్లకి ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరి అవుతారు. సరిగ్గా ఇలాంటి ఘటనే నిజ జీవితంలో చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగి పడడంతో రహదారిపై వెళ్తున్న బస్సు అమాంతం బురదలో మునిగిపోయింది.
అమెరికాలోని కొలంబియాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో రహదారి రెండుగా చీలిపోయింది. దీంతో ఒక్కసారిగా బస్సు బురద గుంతలో పడిపోయింది. రెండు మీటర్ల లోతులో బస్సు కూరుకుపోయింది. రిసరాల్డా పరిధిలో పూబ్లో రికో, శాంటా సిసిలియా గ్రామాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 34 మంది సజీవ సమాధి అయ్యారు. మరణించిన వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. బస్సుతో పాటు మరో రెండు వాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక కారులోని ఆరుగురు వ్యక్తులు, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 70 మంది రెస్క్యూ టీమ్ 24 గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు వెలికితీశారు.
The Colombians government disaster agency said At least 33 people died when a landslide buried a bus in northwestern Colombia on Sunday.
Watch the full bulletin for more latest updates-https://t.co/zUYL4Zt7pS pic.twitter.com/3DLliQsq6y
— DD India (@DDIndialive) December 6, 2022