ఇటీవల వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప విషాదం నుంచి ఇంకా కోలుకోక ముందు పలు దేశాల్లో వరుస భూకంపాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ భూకంపాల తీవ్ర స్థాయిలో వల్ల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా గత కొంతకాలంగా వరుస భూకంపాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో సంభవించిన భూకంప ప్రళయానికి 50 వేల మంది మరణించగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. భారత్, ఇండోనేషియా, అఫ్గానిస్థాన్‌లో తరుచూ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అఫ్గానిస్థాన్‌లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
అఫ్గానిస్థాన్‌లో గురువారం తెల్లవారుజామున 2.35 నిమిషాల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.1 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఫైజాబాద్ కు తూర్పు ఈశాన్యంగా 257 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లుగా ఎన్ సీఎస్ తెలిపింది. తెల్లవారుజామున భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. భయంతో ఇండ్ల నుంచి పరుగులు తీశారు. తమ ఇళ్లలో వస్తువులు ఒక్కసారిగా కదలడం మొదలు పెట్టడంతో భయంతో బయటకు వచ్చామని స్థానికులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఏమేరకు నష్టం వాటిల్లిందన్న విషయం ఇంకా తెలియరాలేదు.
ఇటీవల అఫ్గానిస్థాన్‌లో పలు చోట్లు భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత తజకిస్థాన్ లో భూ ప్రకంపణలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీని తీవ్ర 4.3 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమికి 180 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లుగా ఎన్ సీఎస్ తెలిపింది. ఈ భూకంపాల వల్ల పెద్దగా నష్టం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రజలు భూకంపం అని పేరు చెబితే చాలు భయంతో గజ గజలాడిపోతున్నారు.
Earthquake of Magnitude 4.1 on the Richter Scale strikes Afghanistan pic.twitter.com/GU7P9OIMFu
— ANI (@ANI) March 1, 2023