ఆసియా కప్ లో భాగంగా టీమిండియా కొత్త జెర్సీలో సందడి చేయనుంది. అయితే భారత్ ధరించే ఈ జెర్సీపై పాకిస్థాన్ పేరు ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. దాయాదుల మధ్య జరిగే పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ అభిమానులకి అసలుసిసలు మజా అందించే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇరు జట్లు ఎప్పుడో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడడం మానేశాయి. దీంతో ఈ రెండో జట్ల మధ్య మ్యాచ్ చూడాలంటే ఐసీసీ టోర్నీల కోసం ఎదరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఈ సారి మాత్రం ఆసియా కప్, వరల్డ్ కప్ ఉండడంతో భారత్, పాక్ మధ్య కనీసం మూడు నుంచి నాలుగు మ్యాచులు చూసే అవకాశం అభిమానులకి దక్కనుంది. ఇందులో భాగంగా మొదట ఆసియా కప్ 2023 లో పాకిస్థాన్ తో తలపడనుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు టీమిండియా జెర్సీపై పాక్ పేరు రాయడం అభిమానులని సందిగ్ధంలో పడేసింది.
ఆసియా కప్ 2023 ఆగస్టు 30న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా టీమిండియా కొత్త జెర్సీతో అభిమానులని అలరించనుంది. అయితే భారత్ ధరించబోయే ఈ జెర్సీ మీద పాకిస్తాన్ పేరు ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాళ్లోకేతే.. ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ ఆతిధ్యమిస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏదైనా మెగా టోర్నీకి ఒక దేశం ఆతిధ్యమిస్తే.. ఆ దేశం పేరు జెర్సీలపై ఉంటుంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా కొత్త జెర్సీ ధరించి అభిమానులని సర్ ప్రైజ్ కి గురి చేశారు. ప్రస్తుతం వీరు ధరించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక ఇటీవలే ఆసియా కప్ కోసం పాకిస్థాన్ జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో టీమిండియా జట్టుని కూడా సెలక్ట్ చేయనున్నారు. వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే గాయపడిన స్టార్ ఆటగాళ్లు పూర్తిగా కోలుకున్నారా? లేదా ? ఆసియా కప్ కి సెలక్ట్ అవుతారా ? అనే సందేహాలకు మరి కొన్ని రోజుల్లో తెరపడనుంది. గతేడాది వన్దే ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్.. ఈ సారి వన్డే వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని వన్డే ఫార్మాట్ లో ఈ మెగా టోర్నీ నిర్వహించనున్నారు. పాకిస్థాన్ లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో భారత్- పాకిస్థాన్ మ్యాచులు తటస్థ వేదికల్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 2 న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మరి భారత్ ఇలా పాకిస్థాన్ పేరున్న జెర్సీని ధరించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.