ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా చాలా రోజులుగా అభిమానులను ఊరిస్తోంది. పలుమార్లు విడుదల వాయిదా పడ్డ భీమ్లా నాయక్ ఎట్టకేలకు ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.
భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తవడంతో తాజాగా మరోసారి రిలీజ్ డేట్‌ను మేకర్స్ పోస్టర్ ద్వారా కన్‌ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ సినిమా 400 థియేటర్స్‌కు పైగానే విడుదలవుతోందని భీమ్లా నాయక్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
సినిమా ట్రైలర్ కూడా రాకముందే USAలో భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్స్ లక్ష డాలర్లు పైగా నమోదుచేసి రికార్డులు బ్రేక్ చేసింది. ప్రస్తుతం భీమ్లా నాయక్ తో పాటుగా రిలీజ్ కాబోతున్న ఏ సినిమా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఫీట్ అందుకోలేకపోవడం గమనార్హం. కానీ స్ట్రయిట్ సినిమాలు బ్రేక్ చేయలేని రికార్డులను.. రీమేక్ సినిమా అయిన భీమ్లా నాయక్ క్రియేట్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా సినిమా రిలీజ్ విషయంలో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి భీమ్లా నాయక్ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#BheemlaNayak USA Premiere Pre-Sales: $100,789 from 32 locations 🇺🇸
Crossed the $100K mark one week before release!💥
Pure Power Star @PawanKalyan‘s Mania All Over! 🔥
— Suman TV™ (@SumanTvOfficial) February 18, 2022
Sensational Start to USA Pre-Bookings. Thank you all. #BheemlaNayakUSA@SitharaEnts @PharsFilm @PawanKalyan @vamsi84 @RanaDaggubati @MusicThaman @saagar_chandrak
@MenenNithya @SamyukthaaMenon #Trivikram @TheAakashavaani @idlebraindotcom @Telugu360 @greatandhranews @123telugu pic.twitter.com/nVtXRNZ4hg— PrimeMedia (@PrimeMediaUS) February 18, 2022

పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా మరో హీరోగా నటించిన భీమ్లా నాయక్ లో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్, మాట మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.
సితార ఎంటర్‌టైనర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో భీమ్లా నాయక్ సినిమాను నిర్మించారు. మాస్ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న భీమ్లా నాయక్ చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అటు అభిమానులు సైతం ధియోటర్స్ లో సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
#BheemlaNayak theater list is growing & final list will be out soon.
Massive opening & record collection in place @SitharaEnts @PharsFilm @saagar_chandrak #PawanKalyan @MusicThaman @Cinemark @RegalMovies @AMCTheatres @HarkinsTheatres @EmagineTheatres @AppleCinemas pic.twitter.com/oc1Q2RBYuH
— PrimeMedia (@PrimeMediaUS) February 17, 2022
#BheemlaNayakUSA theater list🔥❤️🎇
More to come…@SitharaEnts @PharsFilm @PawanKalyan @RanaDaggubati @MusicThaman @saagar_chandrak @MenenNithya @SamyukthaaMenon @idlebraindotcom @TheAakashavaani @vamsi84 #BheemlaNayak @Telugu360 @greatandhranews @123telugu @dop007 #Trivikram pic.twitter.com/WBj3LohMGN
— PrimeMedia (@PrimeMediaUS) February 18, 2022
