SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Pawan Kalyan Rayalaseema Development Speech

కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • Written By: Ayyappa Panja
  • Published Date - Mon - 5 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

యుద్ధం వచ్చినప్పుడు, హద్దులు దాటినప్పుడు తన గొంతు ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ ఇది శాంతి సమయం. ప్రజలకు అభివృద్ధి చేయాల్సిన సమయం. అందుకే రాయలసీమ పౌరుషానికి తగిన స్పీచ్ మాట్లాడట్లేదు. రాయలసీమ అభివృద్ధికి అవసరమైన విధంగా మాట్లాడుతున్నా. గొడవలు, కొట్లాటలు, గొడ్డలి పోట్లు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దామంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాయలసీమ పౌరుషాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొడవలకు, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన రాయలసీమను.. అభివృద్ధి పథంలో మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబుతో కలిసి రూ.30,156 కోట్ల విలువైన ‘అమరజీవి జలధార’ పథకానికి శంకుస్థాపన చేశారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు మీద తాగునీటి పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పవన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో 24,601 ఆవాసాల్లో 50,315 పనులను ఈ పథకం కింద చేపట్టనున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘హర్ ఘర్ జల్ – జలజీవన్ మిషన్’కు 2019-24 మధ్య అధికారంలో ఉన్న ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. రూ.26,000 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపి, ఐదేళ్లలో కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రజల తాగునీటి కష్టాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు పవన్.
ప్రజలు ఉంచిన నమ్మకమే తమకు శ్రీరామరక్ష అని పవన్ తెలిపారు.తమది కక్షసాధింపుల ప్రభుత్వం కాదని, ప్రజాభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుందని పవన్ స్పష్టం చేశారు.

2024లో ఈ పథకం ముగిసిపోవాల్సిన తరుణంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సి.ఆర్. పాటిల్, నిర్మలా సీతారామన్‌లను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. వారి సహకారంతో ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించుకుని, పనులను వేగవంతం చేశామని తెలిపారు. “గత ప్రభుత్వం ఖర్చు చేయగా మిగిలిన పనులతో పాటు, ఇప్పటికే మేము రూ.4,500 కోట్ల విలువైన పనులను పూర్తి చేశాం. “దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పులివెందుల నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పథకాలకు రూ.280 కోట్లు కేటాయించి 7 మండలాల్లోని 299 గ్రామాలకు నీరందిస్తున్నాం. అలాగే, వైసీపీ ఎంపీ ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. మాకు పార్టీలు కాదు, ప్రజల సమస్యలే ముఖ్యమని చెప్పారు.

Tags :

  • Amarajeevi Jaladhara
  • Andhra Pradesh News
  • ap news
  • Ap Politics
  • Chandrababu Naidu
  • Jal Jeevan Mission
  • janasena
  • Pawan Kalyan
  • Pawan Kalyan Latest News
  • Pawan Kalyan Speech
  • Proddatur News
  • Rayalaseema
  • Rayalaseema Development
  • telugu news
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • సీఎం చంద్రబాబు పాదాలను తాకిన అనంత్ అంబానీ-వీడియో వైరల్!

    సీఎం చంద్రబాబు పాదాలను తాకిన అనంత్ అంబానీ.. వీడియో వైరల్!

  • రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

    రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • బీసీ రిజర్వేషన్లపై తగ్గేదేలే..సుప్రీంకు వెళ్తామన్న సీఎం

    బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఫైర్.. సుప్రీంకోర్టుకు వెళ్తాం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • గర్భిణి నరకయాతన చూసి కదిలిన గ్రామస్థులు.. రాత్రికి రాత్రే రాతి వారధి!

  • రెండో అంతస్తు నుంచి పడిన బాలుడు.. గాల్లోనే పట్టుకుని కాపాడిన యువకుడు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్? ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్

  • బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

  • సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • హైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూత

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam