టాలీవుడ్ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా ది రాజాసాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా గురించి ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ వస్తోంది. ఎంతవరకూ నిజమో తెలియదు గానీ అదే జరిగితే కచ్చితంగా ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. హారర్ కామెడీ జోనర్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తుండగా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్..పీపుల్ మీడియా బ్యానర్‌పై సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఒకటి విన్పిస్తోంది. సినిమా యూనిట్ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు.
అంతా ఓకే అయితే ఫ్యాన్స్‌కు పూనకాలేనా
ఇప్పటికే జరుగుతున్న ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్‌ను మరింతగా పెంచేసింది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప సినిమా దాదాపుగా పూర్తయింది. ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ విషయంలోనే అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ విన్పిస్తోంది. ఈ స్పెషల్ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ను నిర్మాతలు సంప్రదించినట్టు సమాచారం. ఈ పాట కోసం ఆమెకు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేయొచ్చని తెలుస్తోంది. ఒకవేళ కరీనా ఒప్పుకుంటే సినిమాకు ఈ పాటే హైలైట్ కానుంది. ఈ వార్త ఎంతవరకు నిజం, ఒకవేళ నిజమే అయితే కరీనా అంగీకరిస్తుందా లేదా అనేది తెలియదు.