ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది చాలా కామన్. ఆయా సినిమాల కంటెంట్ బట్టి.. ప్రేక్షకులు కూడా సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. సౌత్ ఇండియాలో పవర్ ఫుల్ పోలీస్ స్టోరీలలో ఒకటి సింగం సిరీస్. తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన సింగం సిరీస్.. ఇప్పటివరకు మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూడు సిరీస్ లు కూడా సౌత్ ఇండియాను షేక్ చేసేశాయి. దర్శకుడు హరి రాసుకున్న పవర్ ఫుల్ స్క్రిప్ట్, హీరో క్యారెక్టరైజేషన్ లకు తోడుగా స్టార్ కాస్ట్, మ్యూజిక్ యాడ్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద సింగం మూడుసార్లు జూలు విదిలించి హిట్ అందుకుంది.
ఇప్పుడీ సింగం సిరీస్ నుండి మరో సీక్వెల్ కి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2010లో యముడు(సింగం), 2013లో సింగం 2ల తర్వాత 2017లో సింగం-3 తెరపైకి వచ్చాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత సింగం-4కి అటు హీరో సూర్య, ఇటు దర్శకుడు హరి ఆలోచన చేసినట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ప్రస్తుతం దర్శకుడు హరి సింగం-4 కోసం కథ సిద్ధం చేస్తున్నాడట. అదీగాక ఇటీవల హరి ‘ఏనుగు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరోవైపు సూర్య చాలా సినిమాలను లైనప్ చేశాడు. డైరెక్టర్ శివ, బాలా, వెట్రిమారన్.. సినిమాలతో బిజీగా ఉన్నాడు.
మొన్నటివరకూ ఆకాశమే నీ హద్దురా, జై భీమ్, ఎవరికీ తలవంచడు.. లాంటి క్లాస్ హిట్స్ చేసిన సూర్య.. ఓ మాస్ స్క్రిప్ట్ కోసం చూస్తున్నాడట. అయితే.. ఆల్రెడీ మాస్ ఆడియెన్స్ కి బాగా నచ్చిన సింగం సిరీస్ ఉండేసరికి డైరెక్టర్ హరిని సింగం-4 కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. అందుకే సూర్య ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తిచేసేలోపు హరి స్క్రిప్ట్ ని సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నాడట. తాజా సమాచారం ప్రకారం.. ఈసారి సింగం-4ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేయనున్నారట. అంటే.. ఇప్పటివరకు సౌత్ ఇండియా వరకే పరిమితమైన ఇన్స్పెక్టర్ నరసింహం.. సింగం-4తో పాన్ ఇండియా డ్యూటీ చేయనున్నాడన్నమాట.
ఇదిలా ఉండగా.. కోలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా మాస్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు. సింగం 3 తర్వాత సింగం-4 ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు సింగం 4 న్యూస్ బయటికి వచ్చేసరికి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయని చెప్పాలి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మూడు సిరీస్ లలో సూర్యకి జోడిగా అనుష్క కనిపించింది. చూడాలి మరి ఈసారి అనుష్కనే ఉండబోతుందా లేక మార్పు ఏమైనా జరుగుతుందేమో.. మొత్తానికి సూర్య – హరి కాంబినేషన్ లో సింగం 4పై అంచనాలు మాత్రం భారీగానే నెలకొన్నాయి. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
#Suriya fans rejoice!
Director Hari Gopalakrishnan has begun scripting the Tamil super cop film #Singam4
Read details:https://t.co/ZmckF7Tu8k pic.twitter.com/C4yC0fzuls— Jagran English (@JagranEnglish) November 9, 2022