బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి, సీజన్ 8 కంటెస్టెంట్ కిరాక్ సీతపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తతో ఎఫైర్ ఉందంటూ సినీ నటుడు ధర్మ మహేశ్ భార్య గౌతమి ఆరోపించడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అండ్ నటుడు ధర్మమహేశ్ భార్య గౌతమి తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్తతో బిగ్‌బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరికి ఎఫైర్ ఉందని, రాత్రిళ్లు ఫ్లాట్‌కు వచ్చేదని చెప్పిన గౌతమి ఇప్పుడు బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్ కిరాక్ సీతపై కూడా ఆరోపణలు చేసింది. డ్రింకర్ సాయి సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య శర్మ కూడా పనికిమాలిన వ్యక్తంటూ గౌతమి మండిపడింది. ఈ ముగ్గురూ తన భర్తతో సాన్నిహిత్యంగా ఉంటారని తెలిపింది. ఇటీవల తాను తన 16వ రెస్టారెంట్ ఓపెనింగ్ కోసం పెద్ద క్రికెటర్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేసిన విఫలమైనప్పుడు కిరాక్ సీత తనకు చేసిన మెసేజ్ తనను ఆశ్చర్యపర్చిందని తెలిపింది. నీ కోసం సెలెబ్రిటీని సెట్ చేయగలనని మెస్సేజ్ చేసిందని గౌతమి చెప్పింది. అసలు తాను రెస్టారెంట్ ఓపెనింగ్ కోసం క్రికెటర్ కోసం వెతుకుతున్నట్టు తనకెలా తెలిసిందని గౌతమి ప్రశ్నిస్తోంది. కచ్చితంగా సీత వెనుక తన భర్త ఉన్నాడంటోంది. ఎందుకంటే కిరాక్ సీతతో తనకు అసలు పరిచయమే లేదని, తన భర్తకు, ఆమెకు మధ్య సంబందం ఎలాంటిదో తనకు తెలియదని చెబుతోంది.
13 ఏళ్లు ప్రేమించుకుని 2019లో పెళ్లి చేసుకున్నామని 2023లో గర్భం దాల్చినప్పటి నుంచి తాను బరువు పెరిగినట్టు గౌతమి చెప్పింది. అప్పటి నుంచి తన భర్త ధర్మ మహేశ్ తనకు దూరంగా ఉన్నాడంటోంది. నీవు బరువు పెరిగిపోయావు, నీపై నాకు ఆసక్తి లేదని ముఖం మీదే చెప్పేవాడంటోంది. ఆ సమయంలోనే రీతూ చౌదరితో పరిచయమైందని..క్రమంగా రోజూ ఫ్లాట్‌కు వస్తోందని గౌతమి ఆరోపించింది.