భారీ అంచనాల మధ్య విడుదలైన RRR చిత్రం రికార్డులన్నింటిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంది. అందరూ ఊహించినట్లే బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. మొదటి రోజే తెలుగు రాష్ట్రాలలో 102 కోట్లకు పైగా వసూలు చేసింది. ఐదు రోజుల కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇక 12వ రోజు కూడా అదే జోరుతో ముందుకు వెళ్తూ.. నయా రికార్డ్ క్రియేట్ చేసింది. నైజాంలో 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. బాహుబలి 2 సినిమా నైజాం ఏరియాలో 60 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన చిత్రంగా రికార్డు ఉండగా.. RRR దాన్ని బ్రేక్ చేసింది.
ఇక 12వ రోజు ఏపీ, తెలంగాణ ప్రాంతాల వారిగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
నైజాం – 2.12 కోట్ల రూపాయలు
గుంటూరు – 24.5 లక్షల రూపాయలు
క్రిష్ణ – 22.25 లక్షల రూపాయలు
ఉత్తరాంధ్ర – 74 లక్షల రూపాయలు
సీడెడ్ – 80 లక్షల రూపాయలు
ఈస్ట్ – 32 లక్షల రూపాయలు
వెస్ట్ – 21 లక్షల రూపాయలు
నెల్లూరు – 18.42 లక్షల రూపాయలు
12వ రోజు ఏపీ, తెలంగాణ టోటల్ షేర్-5 కోట్ల రూపాయలకు పైగానే ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజులకు కలిపి RRR మొత్తం కలెక్షన్లు ఇలా ఉన్నాయి…
నైజాం: 101.31 కోట్ల రూపాయలు
సీడెడ్: 46.75 కోట్ల రూపాయలు
ఉత్తరాంధ్ర: 31.47 కోట్ల రూపాయలు
వెస్ట్: 11.87 కోట్ల రూపాయలు
ఈస్ట్: 14.48కోట్ల రూపాయలు
గుంటూరు: 16.55 కోట్ల రూపాయలు
నెల్లూరు: 8.32 కోట్ల రూపాయలు
క్రిష్ణ: 13.38 కోట్ల రూపాయలు
12రోజులకు కలిపి ఏపీ, తెలంగాణ టోటల్ షేర్: 244.13 కోట్ల రూపాయలకు పైగా ఉంది.
నైజాం ఏరియాలో RRR సరికొత్త రికార్డు…
భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న RRR నైజాం ఏరియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి.. బాహుబలి రికార్డ్‌ను బ్రేక్ చేసింది. నైజాం ఏరియాలో 66.60 కోట్ల రూపాయల అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా బాహుబలి-2 రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ రికార్డును RRR ఈ రికార్డ్ బ్రేక్ చేసింది. 100 కోట్లకు పైగా వసూలు చేసి తిరుగులేని రికార్డు సృష్టించింది.
నైజాం ఏరియాలోఅత్యధిక కలెక్షన్లు సాధించని చిత్రాలు ఇవే..
2022-03-25- RRR సినిమా – 101.31 కోట్ల రూపాయలు (12 రోజుల్లో)
2017-04-28 – బాహుబలి-2 – 66.60 కోట్ల రూపాయలు
2020-01-12 – అల వైకుంఠపురంలో– 43.70 కోట్ల రూపాయలు
2015-07-10 – బాహుబలి-1– 42.00 కోట్ల రూపాయలు
2020-01-11 – సరిలేరు నీకెవ్వరు- 38.50 కోట్ల రూపాయలు
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న RRR సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.