టాలీవుడ్ స్టార్ కపుల్స్ అనగానే రామ్ చరణ్ ఉపాసన పేర్లు గుర్తుకి రావడం కామన్. వీరిద్దరూ వారి కెరీర్స్ ఎంత బిజీనో అందరికీ తెలిసిందే. కానీ.., ఇంత బిజీలో కూడా తమ మధ్య ప్రేమని రోజురోజుకి పెంచుకుంటూ వస్తున్నారు చరణ్, ఉపాసన. ఇక వీలున్నప్పుడల్లా ఈ జంట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. ఇక అన్నిటికి మించి ఉపాసన సేవా గుణం గురించి అందరికీ తెలిసిందే. ఉపాసన లాంటి మంచి భావాలు ఉన్న వ్యక్తి భార్య కావడం తన అదృష్టమని చరణ్ ఇప్పటికే చాలా సార్లు మీడియా ముఖంగానే చెప్పుకొచ్చాడు. కాగా.., ఇప్పుడు ఉపాసన పుట్టినరోజు సందర్భంగా భార్యపై తన ప్రేమని మరోసారి చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
రామ్ చరణ్, ఉపాసన ఒకరి బర్త్ డేని మరొకరు గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటుంటారు. వీరిద్దరి మధ్య బర్త్ డే గిఫ్ట్స్ కామన్ గా ఉండేవే. ఇక ఈ మంగళవారం ఉపాసన పుట్టినరోజు సందర్భంగా చరణ్ సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. “నీ అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి నీవు తోడుగా నిలుస్తావు.. నీ కుటుంబంలో ఎవరికి సాయం కావాలన్నా కూడా వారికి మద్దతుగా నిలుస్తావు. నీకు ఏ బహుమానం ఇచ్చినా కూడా సరిపోదు” అంటూ ఉపాసనకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ చరణ్ ఓ ఫొటోను షేర్ చేశాడు. రామ్ చరణ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ నిజంగా ఉపాసనకి ఏమి గిఫ్ట్ ఇచ్చాడో తెలియకపోయినా..,ఒక్క ట్వీట్ తో భార్య పై ఉన్న మొత్తం ప్రేమని చూపించి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. .
రామ్ చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఇటీవలే ఆచార్యలో కూడా తన షూట్ పూర్తి చేసుకున్నాడు చరణ్. ఈ సినిమాలుపూర్తయిన తరువాత శంకర్ తో మూవీ కోసం ఫుల్ టైమ్ కేటాయించబోతున్నాడట రామ్ చరణ్. అయితే.. కెరీర్ లో చరణ్ ఇంత స్పీడ్ చూపించడానికి ఉపాసన అందిస్తున్న ప్రోత్సాహం కూడా ప్రధాన కారణం. ఇలా తనకి అన్ని విధాలా సపోర్టింగ్ గా ఉంటుంది కాబట్టే.. చరణ్ తన భార్యపై ఇంత ప్రేమ కురిపించాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ స్టార్ కపుల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.