రజనీకాంత్ కూలీ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ త్వరలో దర్శకత్వానికి చెక్ చెప్పనున్నారా, హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా..ఆ వివరాలు మీ కోసం.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీ సూపర్ హిట్ కొట్టడంతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు మార్మోగుతోంది. రెండేళ్ల కష్టానికి, టెన్షన్‌కు తెరపడింది. భారీ కలెక్షన్లు సాధిస్తుండటంతో లోకీ ఇప్పుడు పూర్తిగా రిలాక్స్ అవుతున్నాడు. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం లోకీ కాస్త షాక్ ఇస్తున్నాడు. త్వరలో ఖైదీ 2 తెరకెక్కించనున్న లోకేశ్ కనగరాజ్గ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి..దర్శకత్వానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నాడట. లోకీ హీరోగా తెరకెక్కనున్న ఆ సినిమా వివరాలు తెలుసుకుందాం.
కెప్టెన్ మిల్లర్ సినిమా ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడిగా కొత్త సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు హీరో లోకేష్ కనగరాజ్. ఈ ఏడాది అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే 2026లో విడుదల చేయాలనేది ఆలోచన. అంతేకాదు కొత్త దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌కు లోకీ ఈ మేరకు డెడ్‌లైన్ కూడా విధించాడట. ఎందుకంటే హీరోగా తన డెబ్యూ సినిమా అనుకున్న సమయంలోగా పూర్తి చేసి ముందుగా ప్రకటించిన ఖైదీ 2 సినిమా మొదలెట్టాలనేది లోకేశ్ కనగరాజ్ ప్లాన్. వాస్తవానికి లోకేశ్‌కు ఎప్పటి నుంచో హీరో అవాలనుంది. ఇందులో భాగంగానే గతంలో శృతి హాసన్‌తో కలిసి ఓ పాటలో నటించాడు. ఇక కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ ధనుష్‌తో ఇళయరాజా బయోపిక్ తీయాల్సి ఉంది. కానీ ఆ హీరో ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండి హ్యాండిచ్చాడు. ఈలోగా లోకేష్ కనగరాజ్ హీరోగా తన డెబ్యూ ఆఫర్ ఇచ్చాడు.
దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్‌ను ఆదరించిన కోలీవుడ్ ప్రేక్షకులు హీరోగా స్వాగతిస్తారా లేదా అనేది చూడాలి. ఖైదీ 2 తరువాత బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో లోకీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. హీరోగా తన డెబ్యూ పవర్‌ఫుల్‌గా ఉండేందుకు థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా తీసుకోనున్నాడు. ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. ఈ సినిమా పాత్ర కోసం లోకేశ్ కనగరాజ్ మానసికంగా, శారీరకంగా కొత్త లుక్‌లో కన్పించనున్నాడు.