తెలుగు ప్రజల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ పీవీ సింధు గురించి తెలియని వారు ఉండరు. చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పి దేశ ఖ్యాతిని పెంపొందించింది. పీవీ సింధు ఆటల్లోనే కాదు.. డ్యాన్స్ లోనే తన సత్తా చాటుతుంది.
బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు అందరూ పీవీ సింధుగా పిలుస్తుంటారు.. ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కరలేదు. పీవీ సింధు.. పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తూ ఎన్నో పథకాలు సాధించింది. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఇలా పీవీ సింధు ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అందుకే ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో పురస్కరించింది. పీవీ సింధు కేవలం ఆటల్లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఎంతో చురుకుగా ఉంటుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాటకు పీవీ సింధు అదిరిపోయే డ్యాన్స్ చేసింది… దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి పీవీ సింధు. బ్యాడ్మింటన్ లో ఎన్నో విజయాలు అందుకొని తెలుగు వాళ్ల కీర్తిని, గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిపింది. పీవీ సింధు బ్యాడ్మింటన్ కోర్టులో ఎన్నో సంచలనాలు సృష్టిస్తూనే.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పలు విషయాలు, వీడియోలు ఇన్ స్ట్రాగామ్ లో షేర్ చేస్తుంది. పీవీ సింధుని 35 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ ట్రెడిషన్ లుక్ తో కనిపించే పీవీ సింధు.. డ్యాన్స్ కూడా బాగానే వేస్తుంది. తాజాగా తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో దుమ్మురేపింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీలోని ‘బాసూ.. వేర్ ఈజ్ ద పార్టీ’ అనే పాటకు అదిరిపోయే స్టేప్పులు వేసింది. బ్లూ కలర్ లెహంగాలో చాలా క్యూట్ గా కనిపిస్తుంది పీవీ సింధు.
మెగాస్టార్ పాటకు పీవీ సింధు స్టెప్పులు సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 2.5 లక్షలకు పైగా లైక్స్.. వేల కొద్ది కామెంట్స్ వచ్చాయి. ‘సింధూ జీ మీ డ్యాన్స్ సూపర్.. త్వరలో ఇండస్ట్రీలో చూడాలని అనుకుంటున్నాం’ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. ‘వావ్ మెగాస్టార్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు.. సూపర్’ అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఇటీవల పీవీ సింధు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని.. అందుకే ఫోటో షూట్స్, ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్ అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ తన ధ్యాస మొత్తం స్పోర్ట్స్ పైనే అంటూ స్పష్టం చేసింది.
స్పోర్ట్స్ స్టార్ గా పీవీ సింధు ఎంతో క్రేజ్ సంపాదించింది.. అదే విధంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు ఉన్నంతగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఇన్ స్ట్రాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ అప్ డేట్స్ షేర్ చేస్తుంది. బ్యాడ్మింటన్ కోర్టు లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే పీవీ సింధు మంచి హ్యాపీ మూడ్ లో ఉంటే సూపర్ హిట్ సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ సందడి చేస్తుంది. ఇప్పటికే కచ్చా బాదామ్, అరబిక్ కుతూ సాంగ్ తాజాగా ‘బాసూ.. వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ తన డ్యాన్స్ తో దుమ్మురేపింది. ఆ మద్య గుజరాత్ లో నవరాత్రి వేడుకల్లో అక్కడి సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. అక్కడి ట్రెడిషన్ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పీవీ సింధు డ్యాన్స్ వైరల్ అవుతుంది.