పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ సినిమా ఓజీపై భారీ అంచనాలున్నాయి. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా విక్రయాలు సంచలనం రేపుతున్నాయి. భారీ రికార్డు ధరకు నైజాం హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డీవీవీ ఎంటర్టైనర్ బ్యానర్‌పై, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుటు ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రియా రెడ్డి, అజయ్ ఘోష్‌లు కీలకపాత్రల్లో కన్పించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా రవి కే చంద్రన్ సినీమాటోగ్రఫీ వహిస్తున్నాడు.
దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్‌కు అనూహ్యమైన ఆదరణ లభించింది. పాటలకైతే రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. అందుకే ఓజీ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఏరియా వైజ్ థియేట్రికల్ హక్కుల కోసం విక్రయాలు జరుగుతున్నాయి. సినిమాపై ఉన్న అంచనాల నేపధ్యంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా ఏషియన్ సునీల్, దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ పోటీలో ఉన్నారని తెలుస్తోంది.
ఓజీ సినిమా నైజాం ప్రాంతపు ధియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు ఓ అడుగు ముందుకేసి ఫ్యాన్సీ రేటు ప్రకటించారట. దాదాపు 55 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. జీఎస్టీతో కలుపుకుంటే 60-63 కోట్లు ఉండవచ్చు. ఇది కేవలం నైజాం ప్రాంతపు హక్కుల ధర. సీడెడ్ జిల్లా రైట్స్ ఇంకా తెలియలేదు. అంటే ఓజీ సినిమా ధియేట్రికల్ రైట్స్లోనే రికార్డులు సృష్టించే అవకాశాలున్నాయి.
అఖండ 2తో పోటీ పడుతుందా
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని నిర్మాతలు ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఇదే రోజు బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ సినిమా అఖండ 2 విడుదల కానుంది. బాక్సాఫీసులో ఈ రెండూ పోటీ పడతాయా లేక పోటీ నివారించేందుకు ఏదో ఒక సినిమా వాయిదా పడుతుందా అనేది ఆసక్తిగా మారింది.