తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 50 ఏళ్లుగా చలనచిత్ర పరిశ్రమలో స్టార్ నటుడిగా ఎదుగుతున్నాడు. రజనీకాంత్‌తో నటించడం అంటే అందరికీ ఓ విధంగా జాక్ పాట్ లాంటిది. అలాంటిది ఓ హీరోయిన్ ఏకంగా మూడు సార్లు నిరాకరించింది. ఆ వివరాలు మీ కోసం..
దాదాపు 5 దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న స్టార్ హీరో రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్. బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కే బాలచందర్ తెరకెక్కించిన అపూర్వ రారంగల్ సినిమాలో చలనచిత్ర పరిశ్రమలో అడుగెట్టిన రజనీకాంత్ తనదైన మేనరిజం, స్టైల్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ప్రారంభంలో నెగెటివ్ రోల్ పోషించిన రజినీకాంత్ అనంతరం హీరోగా స్థిరపడ్డారు. 50 ఏళ్ల ప్రస్థానంలో 100కు పైగా తమిళ, తెలుగు, కన్నడ హిందీ సినిమాలు చేశారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం కూలీ కూడా సూపర్ హిట్ అయింది. ఇంతటి స్టార్ డమ్ ఉన్న హీరో కావడంతో ఇతనితో కలిసి నటించడాన్ని జాక్ పాట్‌గా భావిస్తారు. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా మంది అవకాశం అవుతుంది.
నాలుగు సార్లు రజనీకాంత్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్
అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఏకంగా మూడు సార్లు రజనీకాంత్‌తో కలిసి నటించేందుకు నిరాకరించింది. మొదటిసారి నరశింంహ సినిమాలో నీలాంబరి పాత్ర కాగా రెండో సినిమా బాబా. ఇక మూడవ సినిమా శివాజీ అయితే నాలుగో సినిమా చంద్రముఖి. మొదటిసారి ఆఫర్ వచ్చినప్పుడు మరో సినిమాలో ఉండటంతో ఆ అవకాశం రమ్యకృష్ణకు దక్కింది. రెండో సినిమా కాదనడంతో మనీషా కొయిరాలా చేజిక్కించుకుంది. ఇక మూడో చిత్రం శివాజీలో శ్రేయా కాగా నాలుగో చిత్రం చంద్రముఖిలో నయనతారకు అవకాశం దక్కింది. ఆ తరువాత దర్శకుడు శంకర్ కోరిక మేరకు రజనీకాంత్‌తో కలిసి రోబో సినిమాలో నటించింది. ఆమె మరెవరో కాదు..ఐశ్వర్య రాయ్.
అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న ఐశ్వర్యా రాయ్..ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన నటి. అప్పుడప్పుడు వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ లేదా సోషల్ మీడియాలో కన్పిస్తుంటుంది. మొత్తానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సైతం కాదన్న హీరోయిన్‌గా నిలిచింది.