తారక్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చే వీడియో ఇది. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రాగన్ కోసం తనను తాను ఎలా మార్చుకుంటున్నాడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాజా బాలీవుడ్ చిత్రం వార్ 2 నిరాశ పర్చినా ఇంకా ఫ్యాన్స్ ఆశలు, అంచనాలు అన్నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమాపైనే ఉన్నాయి. సినిమా పేరుని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాలో తారక్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తనను తాను మార్చుకుంటున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం రేయింబవళ్లు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే సన్నబడ్డాడు. కండలు తిరిగే బాడీ కోసం జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు.
డ్రాగన్ సినిమా కోసం జిమ్‌లో తారక్ ఎలా కష్టపడుతున్నాడో చూపించే వీడియో ఒకటి లీకైంది. ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ బాడీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. షర్ట్ లేకుండా కేవలం ట్రాక్ ధరించి జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో ఇది. సినిమా కోసం తారక్ పడే కష్టం చూసి అభిమానులు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఈ వీడియోతో డ్రాగన్ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.