వార్ 2 తరువాత ఇప్పుడు తారక్ దృష్టి డ్రాగన్‌పై పడింది. కేవలం తారక్ ఒక్కడికే కాదు ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తారక్ కెరీర్ బెస్ట్ మూవీగా చేసే ప్రయత్నం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ ఇది. తారక్ అప్‌కమింగ్ సినిమా డ్రాగన్ గురించి క్రేజీ ఆప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రత్యేక రోల్ డిజైన్ చేయడమే కాకుండా ఇద్దరు స్టార్ హీరోలను సైతం తీసుకునే ప్లానింగ్ నడుస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. సినిమా హిందీ వెర్షన్‌లో ఓ హిందీ హీరో, తమిళ వెర్షన్‌లో తమిళ హీరోను తీసుకునే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికీ సినిమా టైటిల్ డ్రాగన్ అని ప్రచారమైంది. తారక్ కెరీర్ బెస్ట్ సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రశాంత్ నీల్ ఉన్నాడట. వాస్తవానికి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కొత్త సినిమాకు డ్రాగన్ పేరు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం ఇదే ప్రచారంలో ఉంది.
ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ సినిమా స్క్రిప్ట్ కోసమే చాలా సమయం తీసుకున్నాడట. ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాల్లోనూ ఇదే బెస్ట్ కానుందనే అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే భారీ సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది