నటసింహం బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ ‘వీరసింహారెడ్డి‘. అటు అఖండతో బాలయ్య.. ఇటు క్రాక్ తో ఫామ్ లో ఉన్న వీరి కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’ని మైత్రి మూవీస్ వారు ప్రొడ్యూస్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ లతో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా.. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న వీరసింహారెడ్డి నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ లో వీరసింహారెడ్డిగా బాలయ్య మాస్ విశ్వరూపం చూపించేశారు మేకర్స్. అద్భుతమైన డైలాగ్స్.. డాన్స్.. విజువల్స్ తో పాటు ఎమోషన్స్ ని కూడా చూపించారు. వీరసింహారెడ్డి మూవీని సాంగ్స్, పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు తమన్. ఇదిలా ఉండగా.. వీరసింహారెడ్డి ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అయితే.. ట్రైలర్ మధ్యలో.. “పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి అడుగు.. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది” అనగానే ‘జై బాలయ్య’ అని వాయిస్ వస్తుంది. ఇప్పుడా వాయిస్ ఎవరిదనే చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో, సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ట్రైలర్ లో ‘జై బాలయ్య’ స్లోగన్ వాయిస్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిందేనని అంటున్నారు నందమూరి అభిమానులు. డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లిలో ఎన్టీఆర్ ‘జై బాలయ్య’ స్లోగన్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడదే వాయిస్ ని కట్ చేసి ట్రైలర్ లో పెట్టారని.. రిపీట్ చేసి వింటే అర్థమవుతుందని వీడియో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఇందులో నిజమెంత ఉందో గానీ.. మొత్తానికి ట్రైలర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారని తెలుస్తోంది. అందుకే సంక్రాంతికి అన్నివిధాలా రెడీ అవుతున్నారు. జై బాలయ్య స్లోగన్ ఫ్యాన్స్ కి ఆక్సిజన్ లాంటిది. అందుకే ఆంధ్రా నుండి అమెరికా వరకు జై బాలయ్య అంత పాపులర్. మరి ట్రైలర్ లో జై బాలయ్య స్లోగన్ గురించి మీరేం అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి.
Dis dialog is enuf to shatter every fucking box-office records 🔥🔥🔥#JAIBALAYYA 🔥 🔥 🔥 #NandamuriBalakrishna Sankranthi now 🔥🔥🦁#VeeraSimhaReddyTrailer 💪🦁🔥 pic.twitter.com/lVwjZhPP8o
— NAV (@Nav4Prince) January 6, 2023